Nara Lokesh: లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్? టీడీపీ అధికారంలోకి వస్తుందా?

Nara Lokesh:  ఏపీ ప్రతిపక్ష టీడీపీ వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికలపై దూకుడు పెంచిన టీడీపీ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజధాని అమరావతిపై గట్టిగా పోరాటం చేస్తోంది. బాదుడే బాదుడే కార్యక్రమంలో కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్నారు. నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. నేతలను తమ వద్దకు పిలుపించుకుని పనితీరు బాగాలేని నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనితీరు బాగాలేదని, మెరుగుపర్చుకోకపోతే టికెట్ ఇవ్వడం కష్టమేనని తేల్చిచెబుతున్నారు. ఇక పనితీరు బాగున్న ఎమ్మెల్యేలను ప్రశంసిస్తూ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని, గెలుపు దిశగా పనిచేయాలని సూచిస్తున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కన్ఫార్మ్ అని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ల గడవుకు ముందు రోజు వరకు టికెట్ల విషయం తేల్చరు. నాన్చుడు ధోరణి అవలంభిస్తారు. కానీ ఈ సారి చంద్రబాబు పంథా పూర్తిగా మార్చారు. గతానికంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండేళ్ల ముందే టికెట్ ఫిక్స్ చేస్తున్నారంటూ చంద్రబాబులో ఎంత మార్పులు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబులో మార్పు వచ్చింది. నేతలకు మొమహటం లేకుండా అన్నీ చెప్పేస్తున్నారు.

ఇక లోకేశ్ కూడా గత కంటే బాగా మెరుగయ్యారు. మాట తీరులో గానీ, అధికార పార్టీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే విషయంలో గానీ లోకేష్ మంచి పనితీరును కనబర్చుతుున్నారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ అటు పార్టీని కూడా బలోపేతం చేస్తు్న్నారు. అయితే అధికారంలోకి రావాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని భావించి లోకేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని లోకేశ్ నిర్ణయించినట్లు తెలుగు తమ్ముళ్ల ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు దానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలతో చర్చోపచర్చల అనంతరం లోకేశ్ పాదయాత్ర కన్ఫార్మ్ అయిందని సమాచారం.

వచ్చే జనవరిలో సంక్రాంతి తర్వాత లోకేశ్ పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా సిద్దం చేసే పనిలో నేతలు ఉన్నారు. మొత్తం 450 రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర ఉంటుందని సమాచారం. చిత్తూరు జిల్లా నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలై ఉత్తరాంధ్రలో ముగియనుంది. వారంలో మొత్తం ఏడు రోజుల పాటు లోకేశ్ పాదాయత్ర చేయనున్నారు. విభజన తర్వాత ఏపీలో జగన్ పాదయాత్ర చేయగా.. ఇప్పుడు టీడీపీని అధికాంరలోకి తీసుకొచ్చేందుకు లోకేశ్ పాదయాత్రకకు శ్రీకారం చుట్టారు.

ఈ పాదయాత్ర ద్వారా టీడీపీ మరింత పుంచుకుటుందని, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేశ్ పాదయాత్ర కలిసొస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయడం ద్వారా శ్రేణులు కూడా యాక్టివ్ అవుతారని, పార్టీలో నూతనోత్తేజం వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. మాములుగా అక్టోబర్ నుంచి పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. కానీ నేతలతో చర్చల అనంతరం జనవరికి ముహూర్తాన్ని మార్చుకకున్నారు.

జనవరిలో పాదయాత్ర మొదలుపెడితే 2024 మార్చి నాటికి పాదయాత్ర ముగిసే అవకాశముంటుంది. అ ప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అందుకే ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేయడం ద్వారా మరింత లాభిస్తుందని టీడీపీ వర్గాలు అంచనా వేశాయి. అన్ని ప్రాంతాలను సందర్శించేలా లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేసే పనిలో ఉన్నారు. గతంలో 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేశారు. చంద్రబాబు పాదయాత్రలో 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -