Amaravati Restart: మా ప్రభుత్వం రాగానే అమరావతి రీస్టార్ట్.. అమరావతి వాసులకు లోకేశ్ తీపికబురు ఇదే!

Amaravati Restart: ఇటీవల చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజాగళం సభ ఎంతో విజయవంతమైన సంగతి మనకు తెలిసిందే. మొదటిసారి కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి మోడీ సమక్షంలో జరిగినటువంటి ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈ సభ ఎంతో విజయవంతం కావడంతో ఈ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమం తర్వాత ఏపీకీ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందని ఈయన తెలిపారు.ఇన్ని రోజులపాటు ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు.

ఇక మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని ఈయన విమర్శించారు. మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అంటూ అమరావతి వాసులకు లోకేష్ శుభవార్తను తెలిపారు. మంగళగిరి ప్రాంతంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్ తీసుకువస్తామని మాటిచ్చారు. ఇక, స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఒక్కసారి మంగళగిరిలో కనుక తనకు ఛాన్స్ ఇస్తే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ మంగళగిరి అనేలా మంగళగిరి రూపురేకులే మారుస్తానని ఈయన తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యలన్నింటిని తీరుస్తామని లోకేష్ వెల్లడించారు. అందరికీ ఇక్కడే అందుబాటులో ఉండి అభివృద్ధి పనులను కొనసాగిస్తామంటూ లోకేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -