Nara Lokesh: కరకట్ట కమల్ హాసన్ లా నేను డ్రామాలు ఆడను.. నారా లోకేశ్ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయా?

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తూనే తన పోటీ చేయనున్న మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఇటీవల మంగళగిరిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజలతో ముచ్చటించారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు.. గత ఎన్నికల ఓడిపోయిన తనకు, తనపై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి తేడాను వివరిస్తూ పలు ప్రశ్నలు వేశారు. నారా లోకేష్ ప్రశ్నించి మూడురోజులు అవుతున్నా.. ఇంత వరకూ వాటిపై ఆళ్ల రామకృష్ణరెడ్డి స్పందించలేదు.

నారాలోకేష్ ఆర్కేను కరకట్ట కమల్ హాసన్ అని సంభోదిస్తూ సెటైర్లు వేశారు. ఓ నియోజక వర్గంలో ఓడిపోతే తర్వాత రోజు నుంచి చాలా మంది ఆ ప్రాంతం వైపు చూడరు. కానీ.. తాను గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం నియోజక వర్గ ప్రజలతోనే ఉంటున్నానని చెప్పారు. నియోజకవర్గంలో సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని గుర్తు చేశారు. కుట్టు మిషన్లు, తోపుడు బళ్లు ఇచ్చి ఇక్కడి ప్రజలకు స్వయం ఉపాధి అలవాటు చేశానని చెప్పారు. ఓడిపోయి తాను ఇన్ని చేస్తే.. తనపై గెలిచిన ఆర్కే నియోజవర్గం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. అసలు గెలిచిన తర్వాత ఆయన ఎన్ని సార్లు నియోజకవర్గానికి వచ్చారని నిలదీశారు. 2 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆర్కే ఎంత అభివృద్ది చేశారని ప్రశ్నించారు. ఆయనకు టికెట్ రాదని తెలిసి జగన్ ను తిట్టి కాంగ్రెస్ లోకి వెళ్లి పోయిన విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలను, తనను సీఎం జగన్ మోసం చేశారని ఆర్కే చెప్పిన మాటలను నారాలోకేష్ చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి జగన్ నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ లో చేరారని అన్నారు. కానీ.. రెండు నెలల్లోనే సొంతగూటికి ఎలా చేరారని ప్రశ్నించారు.

ఈ రెండు నెలల్లోనే నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగిందా? అని నిలదీశారు. నియోజకవర్గంలో ఈ రెండు నెలల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అని లోకేష్ స్థానిక ప్రజలను అడిగారు. ఈ ప్రశ్నలు ఎమ్మెల్యే ఆర్కేను అడగాలని లోకేష్ ప్రజలకు సూచించారు. ఎన్నికల ఎలాగూ దగ్గర పడుతున్నాయి కనుక.. మొన్నటి వరకు నియోజకవర్గంలో కనిపించని ఆర్కే.. ఇప్పుడు పొలాల్లో కూడా ప్రచారం చేస్తారని సెటైర్లు వేశారు. ఆయన కరకట్ట కమల్ హాసన్ అని అన్నారు. ఆ యాక్టింగులకు ఎవరూ పడిపోవద్దని లోకేష్ సూచించారు. నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించాలని కోరారు. ఓడిపోయినా.. చేతనైనా సాయం చేశానని గుర్తు చేసిన లోకేష్.. గెలిపిస్తే మరింత చేస్తానని అన్నారు. అలా అని ఎన్నికల కోసమో.. ఓట్ల కోసమో చెబుతున్న మాటలు కాదని చెప్పారు. చేతనైతేనే చెబుతానని.. జరగని మాటలు ఆడనని అన్నారు. కరకట్ట కమల్ హాసన్ లా లేని పోని వాగ్ధానాలు ఇవ్వనని చెప్పారు. అయితే.. నారాలోకేష్ ఇన్ని ఆరోపణలు చేసినా.. ఆర్కే నుంచి ఎలాంటి స్పందన లేదు. లోకేష్ మాటలు కూడా స్థానికులను ఆలోచింపజేస్తున్నాయి. జగన్ పై ఆరోపణలు చేసిన ఆర్కే మళ్లీ ఎందుకు 2 నెలల్లోనే వైసీపీలో చేరారు? అనే ప్రశ్నకు సమాధానం లేదు. జగన్ అవినీతిపై కేసులు కూడా వేస్తానని చెప్పారు. ఈ మాటలు ఎక్కడికి పోయాయని స్థానికంగా చర్చ జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -