Nara Lokesh: మంగళగిరిలో ప్రత్యేక పూజలు చేసిన నారా లోకేష్ కుటుంబం…

Nara Lokesh: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసిన అనంతరం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారాన్ని జోరంధిస్తున్నారు. టిడిపి ముఖ్య నాయకులతో సమావేశాలు అవడం, ప్రతి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి మాట్లాడడం ఎలా నిత్యం కాలి లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు.

 

అయితే తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేష్ పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నారా లోకేష్ కుటుంబ సభ్యులకి ఎక్కువగా దైవభక్తి ఉంటుంది. తాజాగా చంద్రబాబు నివాసంలో కూడా పలు హోమాలు యజ్ఞలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు రాష్ట్ర సంక్షేమం కోరి ఈ హోమాలు చేసినట్లుగా వారు తెలియజేశారు.

ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నారా లోకేష్ కుటుంబ సభ్యులు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలకు లోకేష్ తల్లి నారా భువనేశ్వరి లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ హాజరయ్యారు.పండితుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. రాజ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా మంగళగిరి నుండి పోటీ చేసి ఎలాగైనా సరే విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -