Nara Rohit: వైరల్ అవుతున్న నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు!

Nara Rohit: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారంటు ఉండరు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచం నలువైపులా పాకింది. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ప్రవేశించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి హీరో నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాణం సినిమా ద్వారా హీరోయిన్ల సీను అడుగుపెట్టిన నారా రోహిత్ ఆ తర్వాత సోలో సినిమా ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నారా రోహిత్ నటించిన సినిమాలు హిట్ కాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం నారా రోహిత్ తన సోదరుడు నారా లోకేశ్ కి మద్దతుగా యువగలం పాదయాత్రలో పాల్గొంటున్నాడు.

 

నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ కి మద్దతుగా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ లోకేష్ తో కలిసి నారా రోహిత్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు ఈ పాదయాత్రలో నారా రోహిత్ మాట్లాడుతూ.. లోకేష్ స్ఫూర్తితో యువతరం రాజకీయాల్లోకి రావాలని, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిందని చెప్పుకొచ్చాడు .

 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక టిడిపి పై బురద చల్లుతోందని వైసీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా.. అవసరమైనప్పుడు జూనియర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ వెల్లడించారు. ఇలా తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి నారా రోహిత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -