Giddi Eswari: పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Giddi Eswari:  ఎన్నికలకు పెద్దగా సమయం లేదు కానీ చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో కూడా అభ్యర్థులను స్థాన మార్పిడి చేస్తూ అనూహ్యంగా కొత్తవారికి కూడా టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇలా పలుచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినటువంటి చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాలను రచించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాడేరు నియోజకవర్గం నుంచి గిడ్డి ఈశ్వరి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా బి ఫామ్ అందుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.

పాడేరు నియోజకవర్గం నుంచి బిజెపికి అవకాశం ఉంటుందని బిజెపి నేతలు ఇక్కడ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ ఈ నియోజక వర్గం నుంచి గిడ్డి ఈశ్వరితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా టికెట్ పొందడం కోసం పోటీపడ్డారు. కానీ బిజెపికి కాకుండా పాడేరు నియోజకవర్గం టిడిపికి వచ్చింది దీంతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు కిల్లు వెంకట రమేష్ నాయుడు అనే వ్యక్తికి టికెట్ కేటాయించారు.

ఇలా గిడ్డి ఈశ్వరుని కాదని రమేష్ నాయుడుకి టికెట్ కేటాయించడంతో అక్కడ గిరిజన నేతలు ఒక్కసారిగా ఈ విషయంపై చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని కోరారు. అయితే వీరిద్దరి గురించి చంద్రబాబునాయుడు మరోసారి పాడేరులో సర్వే చేయించారు. ఈ సర్వేలో భాగంగా అత్యధిక మెజారిటీ గిడ్డి ఈశ్వరికి రావడంతో ఆయన చివరి నిమిషంలో టికెట్ గిడ్డి ఈశ్వరికి కేటాయించారు.

ఈ క్రమంలోనే తన అభ్యర్థులందరినీ కూడా ఆదివారం చంద్రబాబు నాయుడు పిలిపించి వారందరికీ బీఫామ్ అందజేశారు. త్వరలోనే వీరందరూ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక చివరి నిమిషంలో గిడ్డి ఈశ్వరికి టికెట్ రావడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆమె గెలుపును చంద్రబాబు నాయుడుకు బహుమానంగా అందిస్తామని పలువురు తేదేపా నాయకులు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -