Naresh: అందంతో ఆకట్టుకుంటున్న నరేష్ కూతురు.. భలే ముద్దుగా ఉందిగా!

Naresh: టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్. ఈ పేరు చెబితే నవ్వని వారుండరు. కామెడీకి పెట్టింది పేరు అల్లరి నరేష్. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి మినిమమ్ గ్యారెంటి హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి హీరో అభిమాని కూడా అల్లరి నరేష్ ని ఎంతగానో అభిమానిస్తారు. అల్లరి నరేష్ గురించి చాలా మందికి తెలుసు కానీ.. ఆయన కూతురు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే తాజాగా సినిమా ఫంక్షన్ లో అల్లరి నరేష్ అల్లరి కూతురు తలుక్కుమని మెరిసింది.

పవర్ ఫుల్ పోలీస్ గా ఈ మూవీలో కనిపించనున్నారు నరేష్. చిన్న పిల్లలు అలాగే పెద్దలు మిస్సింగ్ ను ఛేదించే కథతో ఈ మూవీ ఉండనుంది. ఇక మిస్ అయినా వాళ్లలో నరేష్ భార్య, కూతురు కూడా ఉండటం, వాళ్ళను కాపాడుకోవడానికి నరేష్ ఏం చేశాడు అనేది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండనుంది.

 

ఈ మూవీలో నరేష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.మరోసారి నరేష్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకోనున్నాడు. నరేష్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంటోంది. అలాగే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా చాలా హైలైట్ గా ఉండనున్నాయి.ఈ ప్రయోగాత్మక సినిమాతో అల్లరి నరేష్ ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయంలా అనిపిస్తుంది.

 

ఈ సినిమా మే ఐదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కుమార్తె కూడా నటించడం విశేషం. రెండవ తరగతి పూర్తి చేసుకున్న ఈ చిన్నారి వేదికపై ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంది. ఇలా పెద్దైన తర్వాత తాను కూడా హీరోయిన్ అవుతాను అంటూ ఈ చిన్నారి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -