Ravi Teja: ఆ హీరోయిన్ తో రవితేజ రొమాన్స్.. ఏకీపారేస్తున్న నెటిజెన్స్!

Ravi Teja:టాలీవుడ్ ప్రేక్షకులకు మాస్ మహారాజ రవితేజ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన సొంత కష్టం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపుతో ప్రస్తుతం వెలుగుతున్నాడు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ద్వారా రవితేజ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం తన సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలం గా రవితేజకు మంచి హిట్ సంపాదించి పెట్టిన సినిమానే లేదు. మొత్తం భారీ స్థాయిలో ఘోర పరాజయాన్ని పొందుతున్నాయని చెప్పవచ్చు. గత సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ హిట్లు పరంగా మరోసారి గుక్కతిప్పుకున్నాడు.

నిజానికి ఈ సినిమా రవితేజకు గతంలో ఉండే క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఇక క్రాక్ సినిమా విజయం సాధించిందో లేదో.. రవితేజ వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు. కానీ అవి అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం రవితేజ డైరెక్టర్ త్రినాధరావు దర్శకత్వం వస్తున్న ధమాకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు టీజర్లు చూసిన నెటిజన్లు రవితేజను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 50 ఏళ్ల ముసలోడికి 20 సంవత్సరాల ఆమె తో రొమాన్స్ ఏంటి అని అనుకుంటున్నారు. మరికొందరు రవితేజకు శ్రీలీల మనవరాలు అవుతుందంటూ.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి రవితేజ నెటిజెన్స్ నోట్లో తెగ నానుతున్నాడు. మరి ఈ ట్రోల్స్ గమనించిన రవితేజ నెటిజన్స్ పై ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక ట్రోల్స్ చేసినవారిని చెంప పగలగొట్టినట్టుగా.. హిట్ కొడతాడో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -