Balakrishna: ఆ విషయంలో మాట తప్పిన బాలయ్య.. అందరిలానే బాలయ్య అంటూ కామెంట్స్?

Balakrishna: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి హీరోలు ఇక్కడ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ ఆ హీరోల వెంట పడుతుంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోలు ప్రస్తుతం పదుల సంఖ్యలో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే సీనియర్ హీరోలైనటువంటి చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక అడుగు ముందుకు వేసి థమ్సప్ బ్రాండ్ కు ప్రమోటర్ గా వ్యవహరించారు. అయితే తర్వాత చిరంజీవి ఎలాంటి కమర్షియల్ యాడ్స్ లోను కనిపించలేదు. ఇక నాగార్జున, వెంకటేష్ ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే 40 సంవత్సరాలు పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి బాలయ్య మాత్రం ఇలాంటి కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు.

తాను యాడ్స్ లో నటించనని ఎన్నోసార్లు బాలయ్య తెలిపారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ తన మాటపై నిలబడలేదని డబ్బు కోసం ఈయన కూడా అందరిలాగే కమర్షియల్ యాడ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. బాలకృష్ణ తనని 40 ఏళ్ల సినీ కెరియర్ లో మొదటిసారి శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయి ప్రియ అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే శ్రేయాస్ మీడియా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.ప్రకటనలో రోల్స్ రాయిస్ కారులో ఎంట్రీ ఇస్తూ రాయల్‌గా కనిపించనున్నారు.ఎన్బీకే 1 అని నంబర్ రాసి ఉన్న రోల్స్ రాయిస్ కారును ఈ ప్రకటనకు సంబంధించి టీజర్ పోస్టర్లో చూపిస్తూ బాలకృష్ణ ప్రకటన రంగంలోకి ఆహ్వానిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.ఇక ఈ పోస్టర్ వైరల్ కావడంతో ఎంతోమంది ఈ విషయంపై స్పందిస్తూ డబ్బు కోసం అందరిలాగే బాలయ్య కూడా యాడ్స్ చేస్తున్నారని ఈ విషయంలో బాలయ్య మాట తప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -