Kushi: మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఖుషి.. పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇన్ని రీ రిలీజ్ లు సాధ్యమంటూ?

Kushi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నార. వరుసగా ఏడు సినిమాలు హిట్టుతో ఈయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉన్నారు. దీంతో సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎవర్గ్రీన్ హిట్ సినిమాగా పేరు సంపాదించుకున్నటువంటి చిత్రాలలో ఖుషి సినిమా ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో మణిశర్మ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి ఎంతో స్టైల్ గా పవన్ కళ్యాణ్ సందడి చేశారు.

ఇక ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా తిరిగి 4కె వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా తిరిగి విడుదలైనప్పటికీ కూడా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా మరోసారి ఈ సినిమాని విడుదల చేయడానికి అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 27 సంవత్సరాలు కానున్న నేపథ్యంలో తిరిగి మరోసారి ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే ఒకసారి రీ రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మరోసారి కూడా రీ రిలీజ్ అవుతుంది అంటే ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా రెండు మూడు సార్లు కాదు ఒక పది సార్లు రిలీజ్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -