Spreading Kushi: ఈ లింక్ క్లిక్ చేస్తే విజయ్ దేవరకొండ ఇచ్చే లక్ష రూపాయలు మీ సొంతం.. ఏం చేయాలంటే?

Spreading Kushi: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందినటువంటి విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి సక్సెస్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు ఖుషి సినిమా మంచి సక్సెస్ అందించడంతో ఎంతో సంతోషంలో ఉన్నారు.

చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ ఒక మంచి సక్సెస్ సినిమా అందుకోవడంతో ఈయన ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని తాను సంపాదించిన డబ్బులు కోటి రూపాయలు ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయలు చొప్పున 100 ఫ్యామిలీలకు అందించబోతున్నానని ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా విజయ్ దేవరకొండ తన అభిమానులకు మాట ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన 100 కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇస్తానని ప్రకటించడంతో అందుకు సంబంధించిన విషయాలను ఈ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఈ లక్ష రూపాయలు పొందటానికి ముందుగా మనం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

నా విజయం అండ్ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.. కాబట్టి నా సంపాదన నుంచి ఒక కోటి రూపాయలు మీతో షేర్ చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను. వంద కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ లక్ష రూపాయలు పొందాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి అన్ని విషయాలను పొందపరచాలని ఈయన తెలియజేశారు. ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -