Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీ షోపై నెటిజన్లు ఫైర్.. దారుణం అంటూ?

Sridevi Drama Company: ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ లెవెల్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఒకప్పుడు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షో అంటే అందరికి జబర్దస్త్ గుర్తొచ్చేంది. కానీ, ఇప్పుడు ఒక అండ్ ఓన్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ గుర్తొస్తోంది. ఈ షోలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఓ ఎతైతే.. షోలో పాల్గొన్నవారి టాలెంట్ బయటకు తీయడం మరో ఎత్తు.

 

ఈ వేదిక చాలా మంది సింగర్స్, డాన్సర్స్, యాక్టర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిందనడంలో అనుమానమే లేదు. కండక్టర్ ఝాన్సీ రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. బులెట్ బండి సాంగ్ కి ఝాన్సీ వేసిన స్టెప్పులు యూత్ కి అంతలా కనెక్ట్ అయ్యాయి. అంతటితో ఆగలేదు.. అదే పాటను రవితేజ తన సినిమాలో పెట్టుకొని శ్రీలీలతో కలిసి డాన్స్ ఇరగదీశాడు. ఈ దెబ్బకు కండక్టర్ ఝాన్సీ డైరెక్టగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రెడిట్ అంతా ఖచ్చితంతా శ్రీదేవీ డ్రామా కంపెనీకే ఇవ్వాలి.

అయితే, ఈ మధ్యకాలంలో ఈ షోపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అడల్ట్ జోక్స్, మితి మీరిన డాన్సులతో షోలో కాంపిటేటర్స్ హద్దుల దాటుతున్నారని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈవారం షోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైటీలో సత్య, ఫైమాతో పాటు మొత్తం ఏడుగురు డాన్సులు చేశారు. నాలుగు పాటలకు నాలుగు బ్యాచ్ లుగా వచ్చి చేశారు. ఫాస్ట్ బీట్ పాటలకు ఫాస్ట్ బీట్ డ్యాన్సులతో స్టేజ్ దద్దరిల్లేలా చేశారు. ఈ డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

కొంతమంది ఆ డాన్సులను ఎంజాయ్ చేసినా.. చూడ్డానికి కాస్త ఇబ్బందికరంగా ఉందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దారుణంగా నైటీలతో స్టేజ్ పైకి రావడం.. దాన్ని షూట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేటింగ్ కోసం ఏదైనా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్జిగా ఉన్న ఇంద్రజాకు, యాంకర్ రష్మీకి కూడా రెండు నైటీలు వేస్తే ఇంకా మంచి రేటింగ్ వచ్చేది కదా అని సెటైర్లు వేస్తున్నారు. నైటీలో డ్యాన్సులు ఓ ఎతైతే.. నైటీ ఈజ్ మై నేషనల్ డ్రెస్ అంటూ ఇంద్రజా చేసి కామెంట్ పై కూడా సెటైర్లు పేలుతున్నాయి. అయితే.. ప్రతీ షోకి నైటీతో రావాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ షోలో దొరికిన ఎంటర్‌టైన్‌మెంట్ రికార్డింగ్ డ్యాన్సులో కూడా దొరకదని కొందరు అంటున్నారు. కొరియాగ్రాఫర్ కి బుద్ధి లేకపోతే.. డాన్స్ చేసిన ఆడవారికి అయినా బుద్ధి ఉండాలి కదా? అని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఒక్క నైటీ డాన్స్ సోషల్ మీడియాను రచ్చ రచ్చ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -