Ramoji Rao: రూటు మార్చిన రామోజీరావు.. జగన్ పై మరింత దూకుడు

Ramoji Rao: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియాలోనే రామోజీరావు పేరు చాలామందికి తెలుసు.. మీడియా మోఘల్ గా ఆయనను అందరూ పిలస్తూ ఉంటారు. తెలుగులోనే కాదు ఇండియాలోనే అన్ని భాషల్లో ఈటీవీ న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. దీంతో ఇండియాలోనే మీడియాలో రామోజీరావు బిగ్ షాట్ గా చెబుతూ ఉంటారు. ప్రధాని, అమిత్ షా లాంటి నేతలు నేరుగా వచ్చి రామోజీరావును కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. దానిని బట్టి చూస్తే రామోజీరావు పవర్ ఏంటో తెలుస్తోంది. దేశంలో శక్తివంతమైన మీడియా అధినేతగా ఆయనకు పేరు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు ఎంత పాపులర్ అనేది తెలిసిందే.

తెలంగాణలో టీఆర్ఎస్ కు ఈనాడు సపోర్ట్ గా కనిపిస్తుండగా.. ఏపీలో ఎప్పుడూ చంద్రబాబుకు అండగానే ఈనాడు ఉంటుందని అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే. ఇప్పుడు జగన్ పై ఈనాడు పోరు కొనసాగిస్తుంది. జగన్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతుంది. ఒకరకంగా జగన్ ను ఈనాడు ఇబ్బందులు పెడుతుంది. అందుకే రామోజీరావు పేరు ఎత్తడానికే జగన్ భయపడుతూ ఉంటారు. ఈనాడు చంద్రబాబు పత్రిక అంటూ జగన్, వైసీపీ నేతలు కామెంట్ చేస్తూ ఉంటారు. అంతగా జగన్, రామోజీరావు మధ్య వైరం నడుస్తోంది.

అయితే ఎప్పుడూ ఎన్నికలకు ముందు కొద్దినెలలు ముందుగా మాత్రమే ఈనాడు యాక్టివ్ అవుతుంది. జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉంటుంది. కానీ ఈ సారి రామోజీరావు పంథా మార్చారు. ఇప్పటినుంచి జగన్ వైఫల్యాలను తన పత్రిక ద్వారా ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై జగన్ పవర్ పాయిట్ ప్రెజెంటేషన్ ఇచచారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగానే ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పరిస్ధితి దారుణంగా ఉందని, శ్రీలంకలా ఏపీ మారిపోతుందంటూ టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు.

జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను వ్యతిరేకిస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని తెలియజేస్తూ లెక్కలతో సహా కథనాన్ని ప్రచురించారు. జగన్ చెప్పినవన్నీ అబద్దాలు అని చెప్పేలా ఈనాడులో గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో గతానికి భిన్నంగా రామోజీరావు కొత్త పంథా ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -