Nayanatara: అందం తగ్గిపోతుందని నయన్ అలా పిల్లల్ని కన్నారా.. మనిషివేనా అంటూ? 

Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నయనతార దంపతులు తాజాగా తల్లిదండ్రులైన విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లయినప్పటి నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఊహించని విధంగా విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నయనతార తను ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలను ముద్దాడుతూ ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చామని వీరికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పుకొచ్చారు. ఈ విధంగా విగ్నేష్ కవల పిల్లల గురించి షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతో మంది ఆశ్చర్యపోయారు.
ఇక నయనతార విగ్నేష్ పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చారంటే వీరు సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనీ ఉంటారని భావించిన అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపగా మరి కొంతమంది నేటిజన్స్ మాత్రం పెద్ద ఎత్తున నయనతారపై విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఈ విషయంపై స్పందిస్తూ పిల్లల్ని కంటే అందం తగ్గిపోతుందని నయనతార ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కనింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పిల్లల్ని కంటే అందం పాడవుతుందని ఆ మాతృత్వాన్ని ఆస్వాదించడానికి కూడా ఇష్టపడనటువంటి నువ్వు మనిషివేనా అంటూ చాలామంది ఈమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఏది ఏమైనా నయనతార విగ్నేష్ ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కనడంతో పలువురు అభినందనలు తెలుపగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.అయితే గతంలో నయనతార గర్భసంచి సమస్యలు ఉన్నాయని ఆమె తల్లి కాలేదంటూ కూడా వార్తలు వచ్చాయి. బహుశా ఈ సమస్యల కారణంగానే ఆమె ఇలాంటి పద్ధతి ద్వారా అమ్మగా మారిందని మరికొంతమంది ఈ వార్తలను తిప్పికొడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -