Shakunthalam: ముఖాలు అతికించినట్టుగా సమంత, దేవ్ మోహన్ పోస్టర్.. అది కూడా చేత కాదా?

Shakunthalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఇప్పటివరకు ఈమె ప్రేమకథా చిత్రాలు కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో నటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పౌరాణిక చిత్రాలలో నటించలేదు.అయితే తనకు ఇలాంటి సినిమాలలో నటించాలని ఎప్పటినుంచో కలగా ఉందని అయితే ఆ కల శాకుంతలం సినిమా ద్వారా నెరవేరబోతుంది అంటూ సమంత ఈ సినిమా గురించి తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.

పౌరాణిక చిత్రాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడంలో గుణశేఖర్ ఎంతో దిట్ట. ఈ క్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.ఇప్పటికే షూటింగ్ పనులను పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం మోషన్ పోస్టర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ పోస్టర్ లో సమంత మోహన్ దేవ్ లుక్ పై ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి.ఈ ఫోటోలలో వారు నాచురల్ గా కనిపించడం లేదని వారి మొహాలను తీసుకువచ్చి అతికించినట్టు ఉంది అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఈ పోస్టర్ చూసిన నేటిజన్స్ వారి మొహాలను అతికించినట్టుంది కనీసం గ్రాఫిక్స్ కూడా సరిగా చేయడం చేతకాదా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సమంత లుక్ విషయంలో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ కథ శకుంతల, దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 4వ తేదీ ఈ సినిమా విడుదల కానుందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -