Suma: సుమ నీకెందుకు ఈ భూత పురాణం అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

Suma: గత కొన్ని దశాబ్దాల నుంచి మకుటం లేని మహారాణిగా బుల్లితెరను ఏలుతున్న యాంకర్ సుమ గురించి అందరికీ సుపరిచితమే అయితే ఒకప్పుడు ఈమె ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసేది. అయితే ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ కార్యక్రమం ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే సుమ ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించలేకపోతున్నారు.

ఈ విధంగా యాంకర్ గా దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సుమ తాజాగా క్యాష్ కార్యక్రమంలో వాంటెడ్ పండుగాడ్ చిత్ర బృందంతో సందడి చేశారు ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అనసూయ, యశ్ , విష్ణు ప్రియ వంటి తదితరులు హాజరయ్యారు.ఇక ఎప్పటిలాగే సుమ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తన ఆటపాటలతో టాస్కులతో ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయకు సుమ ఒక టాస్క్ ఇచ్చింది.తన చేతిలో ఒక ఐస్ క్రీమ్ కప్పు పెట్టి తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఐస్ క్రీమ్ తన నోట్లోకరెక్ట్ గా పెడితే తను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పనిలేదని టాస్క్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అనసూయని సుమ ప్రశ్నిస్తూ ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో స్క్రీన్ ప్రజెంట్ అంటే నీకు ఇష్టం ఏ అల్లు అర్జున్ బి రామ్ చరణ్ అంటూ ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్న అడిగిన వెంటనే అనసూయ ఐస్ క్రీమ్ సుమ నోట్లో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తన ముక్కు, బుగ్గలకు మొత్తం ఐస్ క్రీమ్ పట్టించింది. ఇక అనసూయ కళ్ళు తెరిచి తన ఫేసును చూడగానే ఒకసారిగా నవ్వేస్తుంది. నువ్వు నా నోట్లో తప్ప అన్నిచోట్ల పెడుతున్నావు అంటూ సుమ డబుల్ మీనింగ్ డైలాగులు వేసింది.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ కావడంతో ఇది చూసిన అభిమానులు సుమక్క నీకెందుకు ఇలాంటి బూతు పురాణం నువ్వు జగమెరిగిన యాంకర్ వి ఈటీవీ బూతు పురాణం నీకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -