Samantha: ఆంటీలా ఉందంటూ సమంతపై ట్రోల్స్.. ఆ స్థాయి వైభవం ఆమెకు ఎప్పటికీ రాదా?

Samantha: టాలీవుడ్ హీరో హీరోయిన్ లు విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం ఖుషి. శివా నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది అని చెప్పవచ్చు. దీంతో నిన్న సినిమా విడుదల అవ్వగా సినిమా థియేటర్లు ఇప్పటికీ కళకళలాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాలోని పాటల కోసమే సినిమాకు వెళ్తున్నారని చెప్పవచ్చు.

అదిరిపోయే పాటల వల్ల సినిమాకు ముందు నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ కాగా టాక్ కూడా ప్లస్ అయి సినిమా సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. కానీ సమంత విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఈ సినిమా పట్ల కాస్త నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత అభిమానులు ఇది సమంతా రేంజ్ సినిమా కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఇది విజయ్ రేంజ్ సినిమా కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెటిజెన్స్ ఈ సినిమాలో సమంత లుక్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరోగ్యం కారణంగానో లేక మరే ఇతర కారణాల వల్ల తెలియదు కానీ సమంతలో ఇదివరకటి లాగా పేస్ లో గ్లో కనిపించడం లేదు.

ఒకప్పుడు సమంత ప్రేమకథలకు పెద్ద ఎసెట్‌లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తన లుక్స్, ఇమేజ్ అంతలా మారిపోయాయి. విజయ్‌తో ఆమెకు జోడీ కుదరలేదు. విజయ్ లాంటి హ్యాండ్సమ్ కుర్రాడు సమంతను చూసి మైమరిచిపోయి వెర్రెత్తిపోతుంటే అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. సినిమా అంతటా కూడా సమంత లుక్స్, పెర్ఫామెన్స్ ఆశించినంత గొప్పగా లేవు. కొంతమంది ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత కాకుండా మరో యంగ్ హీరోయిన్ ని పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకొక రేంజ్ లో ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇందులో సమంత ఆంటీ లాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -