News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. జగన్ సభలకు ఊకపోస్తే ఊకరాలనంత జనం వస్తున్నారు. దీంతో ఏ సర్వేలు చూసినా వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. తాజా న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ చేసిన సర్వే ఫలితాలు ఊహించిన విధంగా ఉంటాయని తెలిపింది. గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందని ఈ సర్వే తేల్చింది. ఈ సంస్థ మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు సర్వే చేసింది. 50. 38 శాతం ఓట్లతో వైసీపీ 127 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. ఈ సర్వే ప్రకారం టీడీపీ కూటమి 45. 58 శాతం ఓట్లతో 48 స్థానాలకు పరిమితం అవుతుంది. షర్మిల సారధ్యంలోని కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపదనే తేలింది. గత ఎన్నికల్లాగే 1.3 శాతం ఓట్లతో సరిపెట్టుకోనుంది. మహిళ ఓటర్లు వైసీపీకి అండగా ఉండనున్నారు. 53 శాతం మంది మహిళలు జగన్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎంపీల విషయానికి వచ్చినట్టు అయితే, గత ఎన్నికల్లో 22 ఎంపీలను గెలుచుకున్న వైసీపీ ఈ సారి మరో రెండు స్థానాలను కోల్పోనుంది. 20 మంది ఎంపీ స్థానాలు ఈ సర్వే ప్రకారం వైసీపీ ఖాతాలో పడనున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, నర్సాపురం, విజయవాడ, గుంటూరు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుస్తుంది. మిగిలిన స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తుంది.

వైసీపీని సంక్షేమ పథకాలే మరోసారి అధికారం వైపు నడిపంచనున్నాయి. దీనికితోడు ఆరోగ్యం, విద్యారంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన బాగా పెరగిందనే అభిప్రాయం ఉంది. సీనియర్ సిటిజన్లకు పెన్షన్ డోర్ డెలివరీ చేయడంతో వైసీపీకి ఆదరణ పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజకీయ ప్రాతినిథ్యం వైసీపీ హయాంలోనే పెరిగిందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నా.. ఇవి వైసీపీ గెలుపు అవకాశలను దెబ్బ తీసే అంతగా లేవు. అమరావతి సెంటిమెంట్ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ బలంగా ఉందనే భావన కొందరిలో ఉన్నా.. ఈ జిల్లాల్లో కూడా వైసీపీ మెజార్టీ స్థానాలకు సొంతం చేసుకోనుంది. ఇక టీడీపీ, జనసేన కలయికతో గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కూటమి భావిస్తున్నా.. ఫలితాలు 2019 ఎన్నికలను పునావృతం చేస్తాయని ఈ సర్వే తేల్చింది. ఇక రాయలసీమలో మరోసారి తెలుగుదేశం సింగిల్‌ డిజిట్‌ స్థానాలకే పరిమితం అవుతుంది.

న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ గతంలో కూడా సర్వే చేసింది. జనవరిలో చేసిన ఆ సర్వేలో వైసీపీ 49.4 శాతం ఓట్లతో 122 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి 44.34 ఓటింగ్‌ శాతంతో 53 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. అప్పటికి బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదర లేదు. కాబట్టి రెండు జాతీయ పార్టీలో ఏపీలో అవమానకర స్థితిలో పరాభవాన్ని మూటగట్టుకుంటాయని తేల్చి చెప్పింది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. పొత్తు కుదిరిన తర్వాత జరిగిన సర్వేలో వైసీపీకి మరిన్ని స్థానాలు పెరుగుతాయని తెలిపింది. ఇక్కడో ఇంట్రిస్టింగ్ విషయం ఏంటీ అంటే.. మూడు నెలల్లో వైసీపీకి, టీడీపీ కూటమికి ఓటింగ్ శాతం పెరిగింది. వైసీపీ స్వల్పంగా స్థానాలు పెరిగాయి. అంటే.. బీజేపీతో పొత్తు ప్రజలు ఆహ్వానించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -