Niharika: నిహారిక భర్తతో విడిపోవడానికి అసలు కారణాలివే!

Niharika: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలులో ప్రేమలో పడటం చాలా కామన్. ప్రేమలో పడినప్పుడు తమ చుట్టు పక్కల ఏం జరిగినా పట్టించుకోకుండా.. చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటారు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే త్వరగా విడిపోతారు. ప్రేమలో పడి ఏడాది కూడా కాకుండానే.. విడిపోతున్నామంటూ షాకింగ్ నిర్ణయాన్ని రివీల్ చేస్తుంటారు. ఇప్పటివరకు అలా ఇండస్ట్రీలో విడిపోయిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే.. పెళ్లి చేసుకుని సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య వంటి టాప్ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో జంట విడాకులు తీసుకుని అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు.

 

 

ప్రముఖ సింగర్‌ ప్రతీక్‌ తన భార్య నిహారికతో విడిపోతున్నట్లు గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇన్ని రోజులు ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా సింగర్ ప్రతీక్ సోషల్ మీడియా వేదికగా.. తాము విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సుధీర్ఘమైన పోస్టును అప్లోడ్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతీక్-నిహారిక విడిపోతున్నారని తెలిసి వీరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడిపోవద్దని సలహా ఇస్తున్నారు.

 

 

ప్రతీక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ‘ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. మా ఇద్దరి మధ్య పెద్దగా మాటలు కూడా లేవు. చాలా మంది మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అనుకుంటున్నారు. పుకార్లు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అందుకే ఈ విషయంపై మాట్లాడుదామని మీ ముందుకు వచ్చాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. కొద్దిరోజుల క్రితమే మేము విడిపోయాము. ప్రస్తుతం నేను నా వర్క్ పైనే ఫోకస్ పెట్టాను.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, సింగర్ ప్రతీక్‌కు కోల్డ్/మెస్ పాటకు బాగా క్రేజ్ వచ్చింది. ఈ పాట అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ‘ఫేవరేట్ మ్యూజిక్ ఆఫ్ 2019 జాబితాలో ఈ సాంగ్ కూడా యాడ్ చేశారు. అలాగే ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని ‘ఖో గయే హమ్ కహా’ సాంగ్ పాడారు. గతంలో నిహారిక-ప్రతీక్ కలిసి పలు సాంగ్ ఆల్బమ్స్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -