Niharika: అత్తారింటి గుట్టు విప్పిన నిహారిక.. ఏం చెప్పారంటే?

Niharika: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కొందరు పెద్ద వాళ్ల ఫ్యామిలీల చేతిలోనే నడుస్తోంది. అందులో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ మధ్యకాలంలో మెగా హీరోల కంటే మెగా డాటర్స్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆడవాళ్లకు సమాన హక్కులు రావాలంటూ ఎప్పుడూ కష్టపడుతుంటారు. ఈ విషయంలో మెగా డాటర్స్ తీసుకునే నిర్ణయం గర్వించదగినదేనని అభిమానులు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన శ్రీజ, ఉపాసన, సుస్మిత, నిహారిక వాళ్ల వాళ్ల స్టైల్‌లో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

 

మెగా డాటర్ నిహారిక కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ నిర్మాతగా మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ సినిమా నిర్మించింది. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.

పెళ్లై ఇన్ని రోజులైనా.. నిహారిక మొదటిసారిగా అత్తగారింటి గురించి విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ..‘నేను ఇంట్లో చాలా గారాభంగా పెరిగాను. అందరి మధ్యలో ఎక్కువ అల్లరి చేసే దాన్ని. సాధారణంగా నన్ను భరించడం చాలా కష్టం. కానీ మా ఇంట్లో వాళ్లే నన్ను అతి కష్టంగా భరించారు. అదృష్టం కొద్ది పుట్టింట్లో ఎలా ఉన్నానో..

 

మెట్టినింట్లో కూడా అలాగే ఉంటున్నాను. పుట్టింట్లో మహారాణి ఉన్నాను. అత్తగారింట్లో కూడా మహారాణిగానే ఉంటున్నాను. మా అత్తయ్య, మామయ్య నన్ను చాలా బాగు చూసుకుంటారు. నిజం చెప్పాలంటే మా అత్తమ్మకు ఆకలేస్తుందని చెప్తే వచ్చి తినిపిస్తుంది. మామయ్య కూడా ఎంతో సరదాగా ఉంటారు. పుట్టింట్లో ఉన్నప్పుడు నేను ఉదయం 10 గంటలకు నిద్ర లేచే దాన్ని. అప్పుడు మా అమ్మ వాళ్లు తలుపు కొట్టి నిద్రలేపేవారు. అత్తగారింట్లో నాకు నచ్చిన సమయం వరకు నిద్రపోతాను. ఇక్కడ తలుపు కొట్టి నిద్ర కూడా లేపరు. ఆ విషయంలో మా అత్తగారి కాళ్లు మొక్కాలి.’ అని నిహారిక తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -