Niharika: వరుస వివాదాలతో నిహారిక..మెగా డాటర్ కు వార్నింగ్

Niharika: మెగా స్టార్ చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక చాప్టరే ఉంది. సినీ పరిశ్రమలో ఆయనకున్న క్రేజే వేరు. సినీ పరిశ్రమలోకి ఆయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చాలా అవమానాలు పడ్డారు. అంచలంచెలుగా ఎదిగారు. ఇక ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాక ఆయన కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి రాజ్యమేలుతున్నారు. మెగాస్టార్ వారసుడిగా పవన్ కళ్యాణ్ తొలుత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

మెగా బ్రదర్ అయిన నాగబాబు కూడా నటుడిగా, నిర్మాతగా, టవర్ స్టార్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా కేవలం నాగబాబు కూతురు నిహారిక మాత్రమే ఒక మనసు సినిమాతో పరిచయం అయ్యింది. అయితే హీరోయిన్ గా నిహారికకు అది అంత గుర్తింపును ఇవ్వలేదు. ఆ తర్వాత నిహారిక కొన్ని నిర్మాణ బాధ్యతలు తీసుకుని వెబ్ సిరీస్ లను తీశారు. ఏపీకి చెందిన జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహమాడారు. రాజస్థాన్లోని కోటలో నిహారిక పెళ్లి చాలా గ్రాండ్ గా వేడుకగా జరిగింది.

పెళ్లి అయిన తర్వాత నిహారిక ఎన్నో వివాదాల్లో చిక్కుకుందనే చెప్పాలి. పెళ్ళైన కొన్ని రోజులకే జిమ్ ట్రైనర్ తో ఉన్న వీడియోని షేర్ చేయడంతో నిహారికను చాలా మంది పలు మాటలతో విమర్శించారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీని ఆ టైంలో ట్రోల్స్ చేశారు. దీంతో చాలా రోజుల పాటు నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు లో నిహారిక చిక్కుకుని వార్తల్లో నిలిచారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని పార్టీలు, పబ్బులు తిరుగుతుండటం చైతన్య ఫ్యామిలీకి అస్సలు మింగుడుపడలేదు.

అత్తింటివారు నిహారికను అందుకే చాలా సార్లు మందలించారు. క్రిస్మస్ సందర్భంగా కూడా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసి పాల్గొన్న సీక్రెట్ శాంటా ఈవెంట్ లో నిహారిక తన భర్తతో కలిసి పాల్గొనలేదు. వీటన్నింటినీ చూసిన నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారికకు సంబంధించిన ఇలాంటి వార్తలు మరికొన్ని వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -