Adah Sharma: ఆదా శర్మకు భారీ షాక్.. ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసిన పోలీసులు!

Adah Sharma: హీరోయిన్ ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఆదాశర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఊహించినంత క్రేజ్ రాలేదు. కానీ ‘క్షణం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓ స్థాయి వరకు తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగింది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఈ భామ పట్టించుకోవడం మరిచారు.

 

దీంతో ఈ భామ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తెలుగులోనూ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. అది కాస్త వివాదానికి దారి తీయడంతో.. ఆదాశర్మ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ టీజర్‌లో ఆదా శర్మ హిజాబ్ ధరించుకుని చెప్పిన డైలాగులు కేరళలో తీవ్ర దుమారానికి తెరలేపింది.

 

ఆ సినిమాలో మనం చూసినట్లయితే.. ఆదా శర్మ బలవంతంగా మత మార్పిడికి గురైన షాలిని ఉన్ని కృష్ణన్ అనే యువతి పాత్రలో కనిపించబోతుంది. టీజర్‌లో ఆదా శర్మ మాట్లాడుతూ.. ‘నా పేరు షాలిని ఉన్ని కృష్ణన్. నర్సుగా ప్రజలకు సేవలు అందించాలని అనుకున్నా.. ఇప్పుడు నేను ఫాతిమా బాను. ఒక ఐసీస్ టెర్రరిస్ట్. అఫ్గానిస్తాన్ జైలులో ఉన్నాను. నాలా కొన్ని వేల మంది ఇలా జీవిస్తున్నారు. మధ్యతరగతి యువతులను ముస్లింలుగా కన్‌వర్ట్ చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు.

 

బహిరంగంగానే కేరళలో పెద్ద మాఫియాను రన్ చేస్తున్నారు. నాలా ఎన్నో వేల మంది ఉగ్రవాదులుగా మారినవారే. ఇది నా స్టోరీ.. 32 వేల యువతుల స్టోరీ.. కేరళ స్టోరీ.’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ డైలాగులు కేరళ వాసుల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంపై కేరళవాసులు సీఎం పినరై విజయన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సినిమా యూనిట్‌పై కేరళ డీజీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ది కేరళ స్లోరీ సినిమాకు సుదీప్త్ సేన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -