Nithiin: చెత్త టైటిల్ తో రిస్క్ చేస్తున్న నితిన్.. కొంచెం కూడా సెన్స్ లేదా?

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఈయన మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గారు నిలిచింది. అయితే ప్రస్తుతం ఈయన వక్కంతం వంశీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు సగం షూటింగ్ పనులను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించినటువంటి టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు ఎక్స్ట్రా అనే టైటిల్ పెట్టాలని భావించారట. అలాగే క్యాప్షన్ మాత్రం ఆర్డినరీ అనే టైటిల్ పెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ టైటిల్ చదివితే ఎక్స్ట్రాడినరీ అనే టైటిల్ వినిపించడంతో పెద్ద ఎత్తున ఈ టైటిల్ పై అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఎక్స్ట్రా ఆర్డినరీ టైటిల్ తో నితిన్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అసలు ఇదేం టైటిల్ అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఇదే టైటిల్ తో కనుక సినిమా వస్తే సినిమా తప్పకుండా డిజాస్టర్ గా మిగిలిపోతుందని నితిన్ ఖాతాలో మరొక డిజాస్టర్ ఖాయం అంటూ పలువురు భావిస్తున్నారు. సినిమా తరువాతనే వెంకీ కుడుమల-మైత్రీ మూవీస్ సినిమా. ఆ తరువాత వచ్చేది దిల్ రాజు-వేణుశ్రీరామ్ సినిమా. ఈ లోగా జూలై నెలలో వక్కంతం వంశీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతున్నాయి.

 

మరి ఈ సినిమా నుంచి విడుదలయ్యే టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా ఈ సినిమాకు అనుకున్నటువంటి టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టైటిల్ ప్రకటించక ముందే సినిమా డిజాస్టర్ అవుతుందంటూ ఓ అభిప్రాయానికి రావడం గమనార్హం. భీష్మ సినిమా తర్వాత నితిన్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ తనకు సరైన హిట్టు పడలేదని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -