Nithish Kumar: నితీష్ కుమార్ సంచలన హామీ.. ప్రధాని అభ్యర్థిగా ఆయన ఫిక్స్?

Nithish Kumar:లోక్ సభ ఎన్నికలపై జాతీయ పార్టీలు దృష్టి పెట్టాయి. దేశంలో పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ సారి నార్త్ లో కొన్నిచోట్ల బీజేపీకి సీట్లు తగ్గే అవకావముందనే అంచనాలు ఉన్నాయి. అందుకే సౌత్ ఇండియాపై బీజేపీ దృష్టి పెట్టింది. నార్త్ లో తగ్గే సీటును సౌత్ లో భర్తీ చేసుకోవాలని చూస్తోంది. అందుకే సౌత్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ.. ఇక్కడ నజర్ పెట్టింది. సౌత్ లో ఇప్పటికే కర్ణాటకలో అధికారంలోకి వచ్చని బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో బలపడేందుకకు ప్రయత్నిస్తోంది.

అయితే బీజేపీకి మూడోసారి అధికారం దక్కకుండా గెద్దె దించేందుకు ప్రతిపక్షాల పార్టీలు ఇప్పటినుంచే రెడీ అవుతున్నాయి. దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి సన్నాహలు చేస్తుండగానే బీహార్ సీఎం నితీష్ కుమార్ మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్ తో కలిసి ప్రతిక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్టీయే నుంచి బయటకొచ్చిన నితీష్ కుమార్. బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ ను కలుపుుని ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీతో టచ్ లో ఉంటూ ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రతిపక్షాలను తాను ఏకం చేస్తానని, బీజేపీయేతర కూటమికి నాయకత్వం వహిస్తానంటూ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతలను నితీష్ కే అప్పగించినట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఆయనకు పేరుంది. చాలామంది నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేతర కూటమి తరపున ప్రధాని అభ్యర్ధి రేసులో నితీస్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో తాజాగా నితీష్ కుమార్ సంచలన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీయేత కూటమి అధికారంలోకి వస్తే.. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇష్టామని హామీ ఇచ్చారు. వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని నితీష్ కుమార్ ప్రకటించారు. 2007 నుంచి బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆ హామీ వల్ల బీజేపీయేతర ప్రభుత్వాలు కలిసి వస్తాయని నితీష్ కుమార్ ఆశిస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు నితీష్ కుమార్ ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను తెరపైకి తీసుకురావడం వల్ల చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీయేత కూటమికి మద్దతిచ్చే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ప్రకటన వెనుక అసలు వ్యూహం అాదేననే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్,జమ్మూకశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఉంది.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ ను తెరపైకి తీసుకురావడం ద్వారా బీజేపీయేత పార్టీలను ఆకర్షించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రధాని అభ్యరర్థి తానేనని నితీష్ కుమార్ చెప్పుకుంటున్నట్లు అర్థమవుతుంది. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని చాలా పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. మోదీతో పనిచేసిన అనుభవంతో పాటు రాజకీయ అనుభవం దృష్ట్యా చాలా పార్టీలతో ఆయనకు సంబంధం ఉన్నాయి. దీంతో ప్రధాని అభ్యర్థిగా ఆయనను ఫోకస్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -