Nitin Gadkari: బీజేపీలో తుఫాన్.. అసంతృప్తిలో నితిన్ గడ్కరీ?

బీజేపీలో సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టేందుకు రంగం సిద్దమవుతోంది. సీనియర్ నేతలుగా బాగా పేరున్న పాపులర్ లీడర్లను ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా పూర్తిగా పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలైన ఎల్ కే అద్వాణీ, మురళీమనోహర్ జోషీ, వెంకయ్య నాయుడు, యశ్వంత్ సిన్హా లాంటి నేతలను పక్కన పెట్టినట్లుగానే.. ఇప్పుడు నితిన్ గడ్కరీని కూడా అలాగే తప్పించేందుకు చూస్తున్నారు. దేశ రాజకీయాల్లో నితిన్ గడ్కరీకి మంచి పేరుంది. అన్ని పార్టీల నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. విలువగల రాజకీయాలు చేస్తారనే పేరు ఆయనకు ఉంది. సాంప్రదాయ రాజకీయాలు చేస్తారనే గుర్తింపు ఉంది. వివాదాలకు జోలికి కూడా ఆయన వెళ్లరు. దీంతో వివాద రహితుగా కూడా ఆయనకు దేశ రాజకీయాల్లో పేరు ఉంది.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బీజేపీ సీనియర్ నేతగా, కేంద్రమంత్రిగా నితిన్ గడ్కరీ ఉన్నారు. బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. కానీ మోదీ, అమిత్ షాల చేతుల్లోకి బీజేపీ వచ్చిన తర్వాత నియంత పోకడలు పార్టీలో ఎక్కువవుతాయనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది. గుజరాతీకి చెందిన ఈ ఇద్దరు కలిసి పార్టీని తమ గుప్పట్లో పెట్టుకుంటున్నారనే భావన ఏర్పడింది. సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టి తాము చెప్పినట్లుగానే పార్టీ నడవాలని, తమ దారిలోనే అందరూ నడవాలనేలా మోదీ-అమిత్ షా ద్వయం బీజేపీలో ఏకఛక్రాధిపత్యాన్ని సాగిస్తుందనే విమర్శలు ఉన్నాయి.

వెంకయ్య నాయుడు, అద్వానీ, మురళీమనోహర్ లాంటి సీనియర్ నేతలను పూర్తిగా క్రియశీల రాజకీయాల నుంచి తప్పించారు. పార్టీకి సలహాలు మాత్రమే అందించేలా వారిని పరిమితం చేశారు. ఇక ఇప్పుడు నితిన్ గడ్కరీ విషయంలో కూడా అదే ఫార్ములా అమలు చేస్తున్నారనే టాక్ దేశ రాజకీయాల్లో వినిపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ బలమైన నేతగా బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపై ఆయన చాలాసార్లు బహిరంగంగా ఆవేదన వెల్లగక్కారు. ప్రస్తుత రాజకీయాలు అసలు బాగాలేవని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి అవసరంగా వచ్చానంటూ ఆయన ఆవేదన చెందని సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుత రాజకీయాలు అసలు బాగాలేవని, ప్రజలకు కూడా ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చిరాకు వస్తుందని బహుమాటంగా నితిన్ తెలిపారు. పథకాలు ప్రవేశపెట్టి ఓటర్లను ఆకట్టుకోవడం తప్పితే అభివృద్ది గురించి నేతలు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ.. ఇలా బహిరంగంగా విమర్శలు చేయడంతో మోదీ, అమిత్ షా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయనను నెమ్మదిగా తప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.

అందులో భాగంగానే ఇటీవల బీజేపీ పార్లమెంటరీ బోర్డుతో పాటు ప్రచార కమిటీలో ఆయనను తొలగించారు. బీజేపీలో పార్లమెంటరీ బోర్డు అత్యంత కీలకమైనది. కీలక నిర్ణయాలు అన్ని పార్లమెంటరీ బోర్డులో తీసుకుంటారు. దీంతో పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తప్పించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నితిన్ గడ్కరీని మోదీ, అమిత్ షా పక్కన పెట్టేశారని, విబేధాలు నడుస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ తో నితిన్ గడ్కరీకి మంచి సంబంధాలు ఉన్నాయి.

అయినా నితిన్ గడ్కరీని తప్పించడం వెనుక మోదీ, అమిత్ షా వ్యూహం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ప్రభుత్వంలో ఆయనకు కేంద్రమంత్రి పదవి కూడా ఉండదనే చర్చ జరుగుతోంది. మోదీ, అమిత్ షా సీనియర్ల గొంతు నొక్కి పార్టీని తామే నడిపించాలని అనేలా రాజకీయాలు చేస్తుండటంపై సీనియర్లలో అసంతృప్తి నెలకొని ఉంది. కానీ ప్రస్తుతం మోదీ క్రేజ్ కారణంగా సీనియర్లు ఎవరూ ఎదురించేందుకు ముందుకు రావడం లేదు. కానీ నితిన్ గడ్కరీ చాలా ఆవేశపరుడు. అన్నీ ఓపెన్ గా చెప్పేశారు. దీంతో మోదీని ఎదురించే సత్తా నితిన్ కి ఉందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆయన నోరు విప్పితే బీజేపీలో పెద్ద దుమారం రేగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -