Sharmila: ఉద్యోగాలు లేవు.. జీతాలు లేవు.. జగన్ సర్కార్ పై షర్మిల ఫైర్!

Sharmila: రాష్ట్రంలో యువతను నిరుద్యోగులుగా మార్చి పోలవరం నిర్మాణం ఆపేసి అభివృద్ధిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓడించాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో గుంటూరు గుంతలుగా మారిందని ఎద్దేవా చేశారు. గుంటూరులో మంచి రహదారులు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

 

రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు కాలంలో ఒక్క జాబు క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. ముస్లింలు, క్రిస్టియన్స్ కి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని విమర్శించారు. పోలవరం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వైసీపీ మాత్రం బీజేపీ కి ఊడిగం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గడప తొక్కుతా, వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని తెలిపారు.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ, జనసేన, టీడీపీ లలో ఎవరికి ఓటు వేసినా బీజేపీ కి ఓటు వేసినట్లే అన్నారు. బీజేపీ అంటే బాబు,జగన్, పవన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మస్తాన్ వలి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇంక అభివృద్ధికి నిధులు ఎక్కడ వస్తాయని ప్రశ్నించారు.

 

రాజశేఖర్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారని జగన్ మాత్రం పెద్దపెద్ద గోడలు కట్టుకొని కోటలోపలే ఉంటున్నారని ఎద్దేవా చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇంక ప్రజలను ఎలా కలుస్తారు అన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్న జగన్ స్పందించలేదని బీజేపీ కి జగన్ బానిసలాగా మారిపోయారని షర్మిల ఫైర్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -