YS Sharmila: గులకరాయికే అల్లాడావు గొడ్డలి పోటు సంగతేంటి.. జగన్ కు షర్మిల సంధిస్తున్న ప్రశ్నలివే!

YS Sharmila: ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివేకానంద హత్య కేసు గురించి మాట్లాడుకూడదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురందేశ్వరి, షర్మిలకు కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా హత్యకేసు గురించి మాట్లాడకూడదు అంటే కోర్టు ఉత్తర్వులు చారి చేయడం పట్ల తాజాగా షర్మిల స్పందించారు. గత ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు నడిపారని, ఇపుడు తాము వివేకా హత్య గురించి ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితేనే హత్యాయత్నం అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు వేశారు.కానీ, వివేకాను 7 సార్లు గొడ్డలితో నరికి సాక్షి పత్రికలో హార్ట్‌ ఎటాక్ అని ఎలా వేయాలనిపించిందో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తండ్రిని పోగొట్టుకున్న సునీత న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు.

కడప ప్రజలు ఎప్పుడూ కూడా వైయస్సార్ వివేకానంద రెడ్డిని మర్చిపోలేదని వాళ్ళందరూ కూడా న్యాయం వైపే నిలబడతారని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం కోసం గొంతు ఎత్తితే మా గొంతు నొక్కిస్తున్నారని షర్మిల ఆరోపణలు చేశారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఆ భయం కారణంగానే ఇలా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

భావ ప్రకటనా స్వేచ్చకు సంకెళ్లు వేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఇక కడపలో వైయస్ అవినాష్ కు పోటీగా ఈమె ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసి కడప జిల్లాలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -