Ananya Nagalla: అందాలను ఆరబోస్తున్న తెలుగమ్మాయి.. అవి చూపించేస్తూ?

Ananya Nagalla: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తెలుగు భామ అనన్య నాగళ్ల నటించి మెప్పించింది. తర్వాత ఒకటీ రెండు చిత్రాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అందాల సోయగాలను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించి అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచింది ఈ తెలుగమ్మాయి. అందాలను ఆరబోస్తూ కొంటె చేష్టలు చేస్తోంది. అనన్య తాజా ఫొటో సెషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వకీల్ సాబ్ మూవీలోని ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒక క్యారెక్టర్ చేశారు. అంజలి, నివేదా థామస్ తో పాటు అనన్య నటించింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతో జనాల్లో బాగా కనెక్ట్ అయ్యింది ఈ అమ్మాయి.

ఇక ప్రియదర్శి హీరోగా 2019లో ఓ సినిమా విడుదలైంది. ఈ సినిమాతో అనన్య వెండితెరకు పరిచయం అయ్యింది. తెలంగాణకు చెందిన నేతన్న చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రిలీజైంది. మల్లేశం సినిమాలో ప్రియదర్శి భార్యగా అనన్య నాగళ్ల కనిపించారు. ఆ చిత్రంతో కూడా మంచి పేరు సంపాదించుకుంది అనన్య నాగళ్ల.

భారీ ప్రాజెక్టుతో కెరీర్ బ్రేక్ పై ఆశలు..

తాజాగా అనన్య నాగళ్ల ఓ భారీ ప్రాజెక్టులో పని చేస్తోంది. శాకుంతలం మూవీలో నటిస్తోంది. ప్రముఖ హీరోయిన సమంత లీడ్ రోల్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుందని అనన్య భావిస్తోంది.

1

2

3

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -