Raghurama Krishnamraju: బీజేపీకి నర్సాపురం టికెట్.. రఘురామ కృష్ణంరాజుకు భారీ షాక్ తగలడం ఖాయమేనా?

Raghurama Krishnamraju: నర్సాపురం నియోజకవర్గం నుంచి కూటమి తరపున బిజెపి పోటీ చేయబోతున్నారు ఇలా బిజెపికి టికెట్ ఇవ్వనున్న నేపథ్యంలో రఘు రామకృష్ణం రాజుకు భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది. ఈయన కూటమి తరపున పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం టికెట్ ఇవ్వటం లేదని వార్తలు వైరల్ గా మారాయి. ఎలాగైనా తనుకు నర్సాపురం టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈయన జనసేన తెలుగుదేశం వారితో పెద్ద ఎత్తున పరిచయాలు కూడా పెంచుకున్నారు కానీ ఈయన పేరు పరిశీలనలో లేదని తెలుస్తుంది.

గత ఎన్నికలలో వైసిపి పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి రఘురామకృష్ణం రాజు ఇప్పుడు మాత్రం అక్కడ తాను ఉండలేనని భావించి పార్టీకి రాజీనామా చేసి బిజెపిలోకి చేరారు. అయితే బీజేపీ నుంచి కూడా తాను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశాలు లేకుండా చేశారంటూ ఈయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తున్నారు.

ఈ నియోజకవర్గ నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వారికే టికెట్ ఇవ్వాలని వాదన కూడా వినపడుతుంది. ఈ క్రమంలోనే తనకు టికెట్ రాదన్న ఉద్దేశంతో రఘు రామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి తన కోవర్టుల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

2014 ఎన్నికల సమయంలో వైసీపీలో రఘురామ ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బీజేపీలో చేరారు. పొత్తుల్లో భాగంగా నర్సాపురం సీటు వచ్చినా బీజేపీ ఆయనకు కేటాయించలేదు. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు కూడా అలాగే నర్సాపురం సీటు విషయంలో ఈయనకు హ్యాండ్ ఇస్తే గట్టి షాక్ తప్పదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR-Jagan: జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం వెనుక అసలు లెక్కలివే.. ఓడితే మునిగినట్టేనా?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల విషయంలో తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున హడావిడి ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల గురించి ఇటీవల బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడుతూ చేసిన...
- Advertisement -
- Advertisement -