Nara Lokesh: లోకేశ్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదా.. ఏమైందంటే?

Nara Lokesh: టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువగలం పాదయాత్రను ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది మొదట్లో ఈ యువగలం పాదయాత్ర గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించగా ఆ తర్వాత నెమ్మదిగా అసలు పాదయాత్ర గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. అంతేకాకుండా నారా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారా లేకపోతే ఆపేశారా అన్నది కూడా ప్రజలకు తెలియడం లేదు. అంతేకాకు లోకేష్ ఇంతగా పాదయాత్ర చేస్తున్నప్పటికీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాలేకపోతున్నారు. పాద‌యాత్ర ఆరంభ‌మై చాలా కాల‌మే అయినా, ఇప్ప‌టి వ‌ర‌కూ అదొక‌టి సాగుతోంద‌నే ఉనికిని మాత్రం చాటుకోలేక‌పోతోంది.

అసలు నారా లోకేష్ పాద‌యాత్ర మాత్రం ఎవ‌రికీ ప‌ట్ట‌నిదిగా మారింది. చిత్తూరు జిల్లాతో మొద‌లైన ఈ పాద‌యాత్ర ఇప్పుడు ఎక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చిందో తెలుసుకోవ‌డానికి గూగుల్ ను ఆశ్ర‌యించినా క‌ష్ట‌మే అవుతోంది. ఒక‌టికి రెండు మూడు ర‌కాల కీవ‌ర్డ్స్ వాడినా లోకేష్ పాద‌యాత్ర ఎక్క‌డ జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. మ‌రీ ఇలా సాగుతోంది. ప్ర‌స్తుతం లోకేష్ పాదయాత్ర క‌ర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.. లోకేష్ పాదయాత్ర గురించి పచ్చ మీడియా కూడా ప్రచారం చేయకపోవడం ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం. లోకేష్ ను ఆది నుంచి ప‌చ్చ‌మీడియా త‌న భుజాల మీద మోస్తూనే ఉంది. లోకేష్ కు అప‌ర జ్ఞానిగా చూపించ‌డానికి చాలా క‌ష్టాలే ప‌డింది.

 

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ క‌ష్టాల‌న్నీ నిష్ఫ‌ల‌మే అయ్యాయి. ప‌చ్చ‌మీడియా దాదాపు ప‌దేళ్ల నుంచి ఎంత గాలి కొట్టినా లోకేష్ పొలిటిక‌ల్ గ్రాఫ్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌డిపోతూనే ఉంది. చంద్ర‌బాబు వార‌సుడిని మోయ‌డం త‌మ బాధ్య‌త‌గా ప‌చ్చ‌మీడియా తీసుకుంది. అయితే అందుకు ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యం. అంతేకాకుండా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయ్యాడ‌నే అప‌ఖ్యాతి లోకేష్ ను ఎప్ప‌టికీ వ‌ద‌ల‌దు. అలా అడ్డ‌దారిన అధికారాన్ని చెలాయించి లోకేష్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. మంత్రి ప‌దివి పొందినా క‌నీసం ఎమ్మెల్యేగా కూడా నెగ్గ‌లేక‌పోయాడు. మ‌రి త‌న న‌డ‌వ‌డిక స‌రిగా లేద‌ని లోకేష్ అప్ప‌టికీ అర్థం చేసుకోలేదు.

 

ఇప్ప‌టికీ కూడా ఆయ‌న‌కు అది అర్థం కావ‌డం లేదు.
ఇకపోతే లోకేష్ పాద‌యాత్ర‌కు మొద‌ట్లో ప‌చ్చ‌మీడియా కూడా విప‌రీత‌మైన క‌వ‌రేజీని ఇచ్చింది. అదిరిపోతోంద‌నే భ్ర‌మ‌ల‌నేవో క‌లిగించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ రాను రాను అసలు ఆ పాదయాత్ర గురించి సరైన అప్డేట్ లు కానీ వార్తలు కానీ ఎక్కడ వినిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -