NTR-PawanKalyan: డైరెక్టర్ల పాలిట పవన్, ఎన్టీఆర్ దేవుళ్లేనట.. ఎందుకో తెలుసా?

NTR-PawanKalyan: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు ఫ్లాప్ డైరెక్టర్‌కు ఛాన్సులు ఇవ్వడం చాలా రేర్. ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయాలంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఒకవేళ హీరోలు ఛాన్సులు ఇచ్చినప్పటికీ.. నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వెనక్కి తప్పుకుంటుంటారు. కానీ, ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా భిన్నమని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇచ్చి హిట్ కొట్టారు. డైరెక్టర్ల పాలిట దేవుళ్లుగా కొలవబడుతున్నారు.

 

ఫ్లాప్ డైరెక్టర్లకే ఎక్కువగా ఛాన్స్..

ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాప్ డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారు. వరుస ఫ్లాపులతో ఢీలా పడిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘టెంపర్’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా హీరోగా నటించి పూరీ జగన్నాథ్ కెరీర్ పరంగా తారక్ ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా ‘1 నేనొక్కడినే’ సినిమా ఫ్లాప్‌లో ఉన్నాడు. ఎవరూ అవకాశం ఇవ్వని సమయంలో ఎన్టీఆర్‌ అండగా నిలిచాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించారు. ఈ సినిమా హిట్ తర్వాత సుకుమార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాగే త్రివిక్రమ్ కూడా ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరోలు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అరవింద సమేత’ సినిమాలో నటించారు. అయితే ఇలా ఎన్టీఆర్ ఛాన్సులు ఇచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం విశేషం. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమా ఫ్లాపైన విషయం తెలిసిందే.

 

అదే దారిలో పవన్ కూడా..

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు పవన్ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వకీల్‌సాబ్’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ పేరు మార్మోగింది. అలాగే డైరెక్టర్ సాగర్ కే చంద్రకు అవకాశం ఇవ్వడంతో.. ఆయన డైరెక్షన్‌లో ‘భీమ్లానాయక్’ సినిమా తెరకెక్కింది. ఈ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ‘సాహో’ తర్వాత డైరెక్టర్ సుజీత్‌కు ఏ హీరో ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్‌ డైరెక్టర్ సుజీత్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -