Jr NTR-Sameera Reddy: ఆయన నో చెప్పడం వల్లే ఎన్టీఆర్ సమీరా రెడ్డి పెళ్లి జరగలేదా?

Jr NTR-Sameera Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. అతి చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక హీరోలన్న తర్వాత ఇండస్ట్రీలో వారి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

ఈ క్రమంలోనే అప్పట్లో ఎన్టీఆర్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ మరొక నటి సమీరా రెడ్డితో రిలేషన్ లో ఉన్నారని వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ సమీరా రెడ్డి ఇద్దరు కలిసి నరసింహుడు, అశోక్ వంటి సినిమాలలో నటించారు.

ఇలా ఈ రెండు సినిమాలలో వీరిద్దరు నటించడమే కాకుండా వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ భాగ వర్కౌట్ కావడంతో వీరిద్దరి మధ్య ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎన్టీఆర్ సమీరా రెడ్డితో ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే సమీరా రెడ్డితో పెళ్లికి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఒప్పుకోకపోవడంతో ఎన్టీఆర్ తండ్రి కోసం తన ప్రేమనే వదులుకున్నారని సమాచారం.ఇలా ఎన్టీఆర్ సమీరా రెడ్డి వివాహం జరగకపోవడానికి హరికృష్ణనే కారణమయ్యారని, కొడుకు ప్రేమకు తండ్రి శత్రువయ్యారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ విధంగా ఎన్టీఆర్ ప్రేమ వివాహానికి హరికృష్ణ ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక హరికృష్ణ సమీరా రెడ్డికి దూరమవుతూ వచ్చారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన తిరిగి లక్ష్మీ ప్రణతి అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతురుతో ఎన్టీఆర్ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు కూడా కలరు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -