Simhadri: సింహాద్రి స్క్రిప్ట్ బాలయ్యకు చేరుకుండా ఎన్టీఆర్ కు ఎందుకు చేరిందో తెలుసా?

Simhadri: టాలీవుడ్ ప్రేక్షకులకు బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాలయ్య బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బాబు కుర్ర హీరోలతో సమానంగా సినీ ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు.

ఇక బాలయ్య బాబు అన్న హరికృష్ణ వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు స్టార్ హీరోగా హడావిడి చేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనంతటికీ రాజమౌళి కారణమని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా సినీ అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో సింహాద్రి సినిమా బాలయ్య బాబు చేయాల్సిందట. కానీ ఈ సినిమా అలా తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది.

దీనికి కారణం ఏంటంటే.. విజయేంద్ర ప్రసాద్ దగ్గర సింహాద్రి సినిమా స్క్రిప్ట్ ఉంది. నిజానికి ఈ కథను బాలకృష్ణతో తీస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ భావించాడట. కానీ బాలయ్య అంతకుముందే.. బొబ్బిలి సింహం, నరసింహా లాంటి సినిమాలు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చాయి. ఇక సింహాద్రి సినిమా స్టోరీ కూడా కొంచెం అదే పాట్రేన్ లో ఉంటుంది. కాబట్టి విజయేంద్రప్రసాద్ బాలయ్య బాబుకు ఈ స్టోరీ చెప్పలేదు.

ఆ సమయంలో వరుస ప్లాపులు ఎదుర్కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. విజయేంద్ర ప్రసాద్ కి కాల్ చేసి బొబ్బిలి సింహం లాంటి కథ ఏమైనా ఉంటే నేను చేస్తాను అని చెప్పాడట. దాంతో విజయేంద్రప్రసాద్ వెంటనే రాజమౌళితో సింహాద్రి కథను ఎన్టీఆర్ కి వివరించాడట. ఇక ఈ కథ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చింది. ఈ విధంగా బాలయ్య దగ్గరకు చేరవలసిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది. అప్పట్లో సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి సక్సెస్ ను అందించి పెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -