NTR: సినిమాల విషయంలో తారక్ వేగం పెంచాల్సిందే!

NTR: నందమూరి యువ నట సింహం జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానులకు అభిమానంతో పాటు ఒకరకమైన ఉద్వేగం. యంగ్ టైగర్ సినిమా అంటే ఇక అది ఫ్యాన్స్ కు పండగే. అది జూనియర్ ఎన్టీఆర్ నటన, యాక్షన్, డాన్స్ తనదైన టాలెంట్ తో సాధించుకున్న ప్రేమ. సాధారణ హీరోల అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులకు చాలా తేడా ఉంది. ఎన్టీఆర్ అంటే ఒక భావోద్వేగం. తారక్ పై అభిమానం సినిమాకు మించి ప్రవహిస్తుంది.

RRR లో ఔరా అనిపించిన ఎన్టీఆర్..

ఇక ఇటీవల జక్కన్న తెరకెక్కించిన RRR లో తారక్ నటనతో ప్రపంచస్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేసిన విషయం తెలిసిందే. అయితే కొంత మంది అభిమానులు ఎన్టీఆర్ కు కొంచెం తక్కువ క్యారెక్టర్ ఇచ్చారని, ఇంకా ఎఫెక్టివ్ గా ఆ పాత్రను తీర్చిదిద్ది ఉండాల్సిందని ఫీల్ అయ్యారు. అయినప్పటికీ ఎన్టీఆర్ తన పాత్ర స్థాయిని పెంచేలా నటించాడు. దీనితో అభిమానులు పండగ చేసుకున్నారు.

 

ఇక ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఇప్పటికీ తారక్ తర్వాత సినిమాకు సంబంధించి పెద్దగా అప్ డేట్స్ లేవు. దీనితో ఫాన్స్ కొంచెం హర్ట్ అవుతున్నారట. తమ హీరో ఎండాకాలంలో వర్షాల లాగా కాకుండా, వర్షాకాలంలో వర్షాలలాగా వెంటవెంటనే సినిమాలు తీస్తే తాము నిత్యం పండుగ చేసుకుంటాం అని అనుకుంటున్నారట.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇలా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తారక్ వరుస సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. తారక్ క్రేజ్ వేరు, రేంజ్ వేరు.. తారక్ ను తాకడం ఎవరి తరం కూడా కూడా కాదు. కానీ తారక్ గ్యాప్ లేకుండా వెంటవెంట సినిమాలు తీస్తే బాగుంటుంది అని కొంతమంది అభిమానులు అంటున్నారు. ఇదే విషయంపై అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -