Jr NTR: ఆ ముగ్గురుతో కలిసి సినిమా చేయాలనుకున్న ఎన్టీఆర్ కు ఏం జరిగిందో తెలుసా?

Jr NTR: తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తూ వరల్డ్ వైడ్ గా సినీ అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఏదేమైనా ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కి రక్తసంబంధం లేని అన్నలు ముగ్గురు ఉన్నారు. ఇందులో మొదటి అన్న కొడాలి నాని. ఎన్టీఆర్ కి ఈ వ్యక్తి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్నాడు. ఇక రెండవ వ్యక్తి వల్లభనేని వంశీ. ఇతడు పెద్ద ఎన్టీఆర్ కి చిన్న ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఇక మూడవ అన్నయ్య విషయానికి వస్తే వివి వినాయక్. ఆది సినిమాతో ఎన్టీఆర్ కు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టి ఎన్టీఆర్ కు మరింత దగ్గరగా అయ్యాడు. ఈ ముగ్గురు అన్నయ్యలు కలిసి ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయించాలనుకున్నారు.

ఇక ఈ క్రమంలో రైటర్ కోన వెంకట్ ఒక డ్యూయల్ రోల్ స్టోరీ వినిపించాడు. ఇంతకు ఆ కోన వెంకట్ చెప్పిన సినిమా అదుర్స్ సినిమా స్టోరీ. ఈ సినిమా స్టోరీ ఆ ముగ్గురు అన్నయ్యలకు బాగానే కనెక్టయింది. ఇక ఎన్టీఆర్ తో సినిమా తీద్దామని రెడీ అయిపోయారు. సినిమా మొదటి పార్ట్ బాగానే హ్యాపీగానే ఫినిష్ చేసుకున్నారు. ఇక రెండో భాగం విషయానికొస్తే ఆ షెడ్యూల్ మొత్తం తారుమారు అయింది.

2009లో ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేసి ఇంటికి వస్తున్న సమయంలో మార్చి 22 అర్ధరాత్రి 12 గంటల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ తో ఎన్టీఆర్ కి బాగా గాయాలు అయ్యాయి. ఇక అదుర్స్ సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా పుల్ స్టాప్ పడిందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఎన్టీఆర్ తన పట్టుదలతో సెకండ్ హాఫ్ షూటింగ్ కూడా పూర్తిచేసి.. ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -