NTR-Balayya: తారక్ ను బాలయ్య అవమానించారా.. ఏమైందంటే?

NTR-Balayya: టాలీవుడ్ లో చాలామంది హీరోలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండే వచ్చారు. అయితే వాళ్ల ఎంట్రీకి మాత్రమే కుటుంబ నేపథ్యం పనికి రాగా.. చాలామంది స్టార్ హీరోలు తమలోని ట్యాలెంట్ తో సొంతంగా స్టార్ హీరోగా ఎదిగారు. ఇలా సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి.. టాలీవుడ్ లో నటనలో, డ్యాన్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

 

నందమూరి వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ నుండి తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న యంగ్ టైగర్.. త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి తన తర్వాత సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొననున్నాడు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి చేసిన ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. అమెరికాలో ఎంతో అట్టహాసంగా సాగిన ఈ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణిలు తమ ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో.. అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా కీర్తి పతాకం ఎగిరింది.

 

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో అందరూ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణిలను అభినందిస్తూ.. ట్వీట్లు చేశారు. ప్రధానితో సహా పలువురు ఇలా శుభాకాంక్షలు తెలుపగా.. నందమూరి బాలయ్య మాత్రం ఎలాంటి ట్వీట్, శుభాకాంక్షలు తెలపకపోవడం చర్చకు దారితీసింది. ‘ఆర్ఆర్ఆర్’ టీంని అభినందించాల్సి వస్తే.. ఎన్టీఆర్ కి కూడా శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుందని.. తనకు ఏమాత్రం ఇష్టంలేని ఎన్టీఆర్ కు విషెస్ చెప్పడం ఇష్టంలేకనే బాలయ్య విష్ చేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -