Health Benefits: ఆ రోగాలకు చెక్‌ పెట్టాలంటే ఎర్రబెండను తినాలట!

Health Benefits:  బెండకాయలు వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. ఎప్పుడైన అనారోగ్యానికి గురైనప్పుడు ఏ ఆహారం తినాలనిపించదు. అలాంటప్పుడు రొట్టేతో కేవలం బెండకాయ ఫ్రై మాత్రమే తింటుంటారు. అందుకు బెండకాయను ఎక్కువగా తినాలని పెద్దలు కూడా చెబుతుంటారు. వాటని వివిధ రకాల వంటకాల్లో వెస్తుంటారు. అది అరోగ్యంతో పాటు రుచికరంగా ఉంటుంది. సాధారణంగా బెండకాయ ఆకుపచ్చని రంగులో మాత్రమే ఉంటాయి.ఎర్ర బెండకాయలు ఉంటాయని చాలా మందికి తెలియదు. పచ్చ బెండకాయాల కన్నా ఇందులో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. ఎర్ర బెండకాయాల్లో ఐదు శాతం ప్రోటిన్లు 12 శాతం ఇనుముతో పాటు రోగ నిరోధక శక్తి, జీవక్రియను మెరుగుపరచడంలో ఈ బెండకాయలు చాలా ఉపయోగపడుతాయి.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండియన్‌ వెజిటబుల్‌ రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌ చాలా ఏళ్ల పరిశోధనల తర్వాత ఎర్రబెండను అభివృద్ధి చేసినట్లు తెలిసింది. ఇవి కొలెస్ట్రాలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ కలిగి ఉంటుంది. ఎర్ర బెండకాయలు గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. ఎరుపు బెండలో ఉండే ఐరన్, కాల్షియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యం గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

ఎర్ర బెండను తినడంతో రక్తపోటు తగ్గి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు అనేక వ్యాధులను కంట్రోల్‌లో ఉంచేందుకు ఈ ఎరుపు బెండకాయలు ఎంతగానో సహకరిస్తాయి. ఎర్ర బెండకాయాల్లో అధిక ఫైబర్‌ కంటెంట్‌ ఉంటుంది. అలాగే అల్సర్లు, పేగు సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు, ఎముకలు, కీళ్లలో అరుగుదల ఉన్నవారు ఈ ఎర్ర బెండను ఆహారంలో చేర్చుకోవడంతో శరీర స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -