ODI Format: పాకిస్థాన్ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన కివీస్

ODI Format: అంతర్జాతీయ వన్డేల్లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్ గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. పాకిస్థాన్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో కివీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2–1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకార్ జమాన్ సెంచరీతో చెలరేగాడు. 122 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 101 పరుగులు చేశాడు.

 

అటు నాలుగో స్థానంలో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ 77 పరుగులతో సత్తా చాటాడు. యువ ఆటగాడు సల్మాన్ 45 పరుగులు సాధించాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా బ్రేస్‌వెల్, ఇష్ సోథీ తలో వికెట్ సాధించారు.

 

అనంతరం 281 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి టార్గెట్‌ను చేరుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే మరోసారి రాణించాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతడు ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(52)తో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 63 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 53 పరుగులతో రాణించాడు.

 

తొలి వన్డేలో ఓడిన న్యూజిలాండ్
పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టుకు సిరీస్ విజయం కష్టమని అభిమానులు భావించారు. కానీ రెండో వన్డేలో న్యూజిలాండ్ అనూహ్యంగా చెలరేగింది. 262 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్‌ను 182 పరుగులకే ఆలౌట్ చేసింది. అటు మూడో వన్డేలోనూ కివీస్ బౌలర్లు చెలరేగారు. గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా, డెవాన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -