Tarak: అయ్యో.. తారక్ హీరోయిన్ ను అలాంటి వ్యాధులు వేధిస్తున్నాయా?

Tarak: సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు పలు రకాల వింత వ్యాధుల బారిన పడుతుండటం తెలిసిందే. సినిమా తెర మీద అందంగా, నవ్వుతూ కనిపించే సినీ నటులకు మరీ ముఖ్యంగా హీరోయిన్లకు వచ్చిన వ్యాధుల గురించి తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తనకు వయోసైటీస్ అనే వింత వ్యాధి ఉన్నట్లు వెల్లడించి అందరికీ షాకివ్వడం తెలిసిందే.

ఎంతో అరుదుగా వచ్చే మయోసైటీస్ వ్యాధి బారినపడ్డ హీరోయిన్ సమంత ప్రస్తుతం దానికి చికిత్స చేసుకుంటూ ఉండగా.. ఆ మధ్యన ఆమె చికిత్స కోసం సౌత్ కొరియాకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కోవలో మరో హీరోయిన్ చేరింది. తెలుగుతో పాటు తమిళంలో తన పాటలతో ఫేమస్ అయి తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన మమతా మోహన్ దాస్ కు కూడా ఓ అరుదైన వ్యాధి సోకడం సినీ అభిమానులను కలవరపరుస్తోంది.

హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఇటీవలే క్యాన్సర్ తో పోరోడి.. విజయం సాధించింది. దాని తర్వాత ఇప్పుడు ఆమె విటిలిగో అనే వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ద్వారా ఆమెకు ఈ వింత వ్యాధి సోకినట్లు నిర్దారణ అయింది. ‘సూర్యుడా..నీకంటే ముందు నీ సూర్యకిరణాలు నాపై పడటానికి నేను ముందుగా నిద్రలేస్తాను.. నీ శక్తినంతా నాకు ఇవ్వు.. ఎప్పటికీ నేను నీకు రుణపడి ఉంటాను’ అంటూ మమతా మోహన్ దాస్ తన ఇన్ స్టాగ్రాం లో ఓ పోస్ట్ పెట్టింది.

కాగా మమతా మోహన్ దాస్ సినీ ఇండస్ట్రీలోకి కోరస్ సింగర్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత సింగర్ గా అవకాశాలు అందుకొని, హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మమతా మోహన్ దాస్.. తనదైన నటనతో అందరినీ మెప్పించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -