Old Heroes: నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతున్న ముసలిహీరోలు.. నమ్మకపోయినా వాస్తవాలివే!

Old Heroes: సినిమా ఇండస్ట్రీలో హీరోలు అందరూ కూడా సంబంధం లేకుండా పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అయితే చాలామంది సీనియర్ హీరోలు కూడా ప్రస్తుత యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ… తాము కూడా యంగ్ హీరోలే అనిపించుకోవడం కోసం భారీ స్థాయిలో మేకప్ వేసుకుని యంగ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులను మాత్రం ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాయి.

హీరోలు నేటివిటీకి అనుగుణంగా సినిమాలు చేయడం మానేసి కుర్ర హీరోలు మాదిరిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది అన్ని సార్లు వర్కౌట్ కాదనే చెప్పాలి. ఆరు పదుల వయసులోనూ, ఏడుపదుల వయసులోను తమ వయసుకు తగ్గ సినిమాలలో నటించకుండా యంగ్ హీరోల తరహాలో ప్రేమ కథ చిత్రంలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 

ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా ఇదే ధోరణిలో సినిమాలో చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఆ సినిమాలను ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేకపోవడమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తున్నారు. తమిళంలోనూ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు వారి వయసుకు తగ్గ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.కానీ తెలుగులో అందరు హీరోలు కాకపోయినా కొందరు హీరోలు మాత్రం యంగ్ గా కనిపించే ప్రయత్నం చేస్తూ నిర్మాతలను నిండా ముంచుతున్నారు.

 

ఇలా కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా, యంగ్ గా కనిపించడానికి ప్రత్యేకంగా మేకప్ వేయడం కోసం అధికంగా డబ్బులు ఖర్చు చేయడం చేస్తున్నారు. అదేవిధంగా కుర్ర హీరోయిన్లతో ప్రేమకథా చిత్రాలలో నటించడమే కాకుండా మరొక స్పెషల్ సాంగ్ అంటూ ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ విషయంపై హీరోలు ఆలోచించి వారి వయసు దగ్గర చిత్రాలలో నటిస్తే బాగుంటుందని లేకపోతే వరుస ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -