Jr NTR: మళ్లీ మోసపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించారు.

అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రకటన అనంతరం ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పనులను కూడా మొదలు పెట్టలేదు. రాజమౌళి సినిమా విడుదల అయ్యి సుమారు 7, 8 నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని మొదలు పెట్టకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. అక్టోబర్ 12వ తేదీ ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ విడుదల కాబోతుందని వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర స్థాయిలో మోసం చేశారని తెలుస్తుంది.

అక్టోబర్ 12వ తేదీ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా చూసారు. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు.ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని వార్త మరోసారి వైరల్ కావడంతో అభిమానులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో తీవ్రస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా సైలెంట్ గా ఉండడం గమనార్హం. ఈయనతో పాటు సినిమాలు చేసిన మిగతా హీరోలు కూడా తదుపరి సినిమా షూటింగులను పూర్తి చేయబోతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -