Young Tiger NTR- Lokesh: లోకేశ్ ను ఎదురించే దమ్ము, ధైర్యం యంగ్ టైగర్ కు మాత్రమే ఉందా?

Young Tiger NTR- Lokesh: ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒంగోలు జిల్లాలో నారా లోకేష్ పర్యటన ఉండగా ఇలాంటి సమయంలో ఇలాంటి ఫ్లెక్సీలు వెలిసి అందరికీ షాక్ ఇచ్చాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలు వచ్చే వరకు కొసరోడికి పండగే అని ఆ ఫ్లెక్సీలు మీద రాసి ఉండటం గమనార్హం. అయితే ఈ ఫ్లెక్సీలను అద్దంకి బస్టాండ్ సమీపంలోనూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఫ్లైఓవర్ కింద చర్చ సెంటర్ కనిగిరి మరొక రెండు చోట్ల కూడా పెట్టారు.

పెట్టినవారు ఎవరో తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ పని అంతా ఎన్టీఆర్ అభిమానులు చేశారని అనుకున్నారు కానీ నారా లోకేష్ పర్యటనకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక వైసీపీ శ్రేణులే ఇదంతా చేశాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వైసీపీ నేతలే ఇలాంటి హడావిడి చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఫ్లెక్సీలు వేయటం నినాదాలు చేయడం వాళ్లకి అలవాటే.

 

వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే లోకేష్ ని ఎదుర్కోవటం జగన్ రెడ్డి వల్ల కావడం లేదని కాబట్టి ఎన్టీఆర్ రావాల్సిందే అన్నట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారంటే కారణం లేకపోలేదు ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టించారు స్వరూ ఆధారాలతో సహా నిరూపించారు. ఎందుకంటే బహిరంగంగా ఫ్లెక్సీలు పెడితే ఎక్కడ ప్రింట్ తీయించారు ఎవరు తీయించారు అని తెలుసుకోవడం చాలా సులువైన పని.

 

అలాగే టీడీపీ వర్గాల వారు కూడా ఏ ఫ్లెక్సీలు కొట్టించింది బాలినేని ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో ఈ పని చేయించారని రుజువు చేశారు. పాపం ఇలా అడ్డంగా దొరికిపోతామని ఊహించని వైసీపీ నేతల పరువు పోయినట్లుగా అయింది. లోకేష్ ని ఎదిరించే దమ్ము ధైర్యం ఆ ఎన్టీఆర్ కే తపితే మీ నాయకుడికి లేదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -