CM YS Jagan: ప్రభుత్వ నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత.. ఆత్మరక్షణలో జగన్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. జగన్ నిర్ణయాలతో వైసీపీ కూడా ఇబ్బందుల్లో పడుతోంది. ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో దిక్కుతోచని స్ధితిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలవుతుంది. జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఎవరికీ అర్ధం కాలేదు. సొంత పార్టీ నేతలకు కూడా జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుుకుంటారో తెలియడం లేదు. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ తీసుకునే నిర్ణయాలు తెలియడం లేదు. రాత్రికి రాత్రి జగన్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో చివరికి జగన్ తీసుకునే నిర్ణయాలు బయటికి తెలిసిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలే ఆశ్చర్యపోతున్నారు.

ఏ ప్రభుత్వమైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముందుగా వార్తలు వస్తాయి. ముందుగానే మీడియాకు లీకులు ఇస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను తీసుకుంటుంది. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ప్రకారం ఏ ప్రభుత్వమైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో జగన్ మాత్రం ఎవరికీ తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరికి తెలియకుండా తానే సొంతగా నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందు కార్యకర్తలు, నేతలతో చర్చిస్తుంది.

కానీ జగన్ మాత్రం ఎవరికీ చెప్పరు. తానే సొంతగా నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత పార్టీ నేతలకు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో కూడా జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకకున్నారు. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. పొద్దునే అసెంబ్లీలో పేరు మారుస్తూ ిబిల్లు ప్రవేశపట్టారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. మంత్రులకు రాత్రికి రాత్రి ఆన్ లైన్ లో పెట్టి ఆమోదింపచేసుకున్నారు. జగన్ నిర్ణయంపై సొంత పార్టీ నేతలేు విమర్శలు చేస్తున్నారు.

జగన్ నిర్ణయం తీసుకునే వరకు తమకు కూడా తెలియదని, ఒక్కసారిగా బిల్లును ప్రవేశపట్టడంతో ఆశ్చర్యపోయామని అంటున్నారు. జగన్ నిర్ణయంపై సొంత పార్టీ నేతలే విమర్శలు కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడం సరికాదని సొంత పార్టీనే జగన్ పై విమర్శలు వస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు బయటకు చెపపడానిక జంకుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ బయటకు బహిరంగంగా చెబితే పదవి పోయే అవకాశముంది. అందరూ వైసీపీ నేతలు ఎవరూ బయటకు తమ ఆక్రోశాన్ని బయటకు చెప్పుకోలేక రలిగిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -