OTT: ఓటీటీలో సునామీ సృష్టిస్తున్న బాలయ్య.. దబిడి దిబిడే!

OTT: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’. ఈ షో ఎంత సక్సెస్ అవుతుందో తెలిసిందే. బాలకృష్ణ వల్లే అన్‌స్టాపబుల్ షో భారీగా సక్సెస్ అందుకుంటోంది. అయితే ఈ షో ఆలోచన అరవింద్‌ది అయినా.. దాన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించింది బాలయ్య మాత్రమే. అప్పటివరకు బాలయ్యలో యాంగ్రీ యాంగిల్ మాత్రమే చూసిన ప్రేక్షకులు.. ఈ షో ద్వారా మరో యాంగిల్‌ను కూడా చూపించారు. అన్‌స్టాపబుల్ షో చూసిన ప్రేక్షకులు బాలయ్యలో ఇన్ని వేరియేషన్స్ దాగి ఉన్నాయా? అని షాక్‌కు గురయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అన్‌స్టాపబుల్ షోకి బాలయ్యే బ్రాండ్‌గా మారిపోయారు. ఈ షోలో బాలయ్య ప్రశ్నలు, జోకులు, చమత్కారాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. షోకి గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో సంచలన నిజాలు బయటపెట్టించారు. కామెడీ టైమింగ్‌లోనూ బాలయ్యను మించిన వారు ఎవరూ లేరు. ఇదంతా కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యం.

అయితే ఇప్పటివరకు ఏ షోకి హోస్ట్ గా వ్యవహరించిన నటులు గెస్టులుగా వచ్చిన వారితో వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు రాబట్టలేకపోయారు. పర్సనల్ విషయాల గురించిన షోలో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కానీ బాలయ్య మాత్రం ఎంతో ఇంటెలిజెంట్‌గా వాటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అన్‌స్టాపబుల్ సీజన్-1 ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సీజన్-2 కూడా స్టార్ట్ అయింది. ఇందులో బాలయ్య రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి.. వారితో రప్పాడించేస్తున్నాడు. సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ గెస్టులుగా వచ్చారు. ఇందులో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు గురించి, లోకేశ్ పర్సనల్ ఫోటో గురించి డైరెక్ట్‌ గానే అడిగేశాడు. ఇలాంటి ప్రశ్నలు వేయాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. అంత దమ్ము ధైర్యం తనలోనే ఉన్నాయని బాలయ్య నిరూపించాడు. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని ఆయా షోలకు హోస్టుగా వ్యవహరించారు. కానీ ఈ షోలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ బాలయ్య మాత్రం బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. ఓటీటీలోనూ బాలయ్య సునామీ సృష్టిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -