Asaduddin Owaisi: విమోచన దినోత్సవంపై ఓవైసీ కొత్త వాదన.. పోటీగా భారీ ప్లాన్

Asaduddin Owaisi: సెప్టెంబర్ 17న తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? పోటీపోటీ సభలతో హైటెన్షన్ క్రియేట్ అవుతుందా? టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తాయా? రాజకీయ వేడి మరింత పెరుగుతుందా? రాష్ట్రానికి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు వచ్చి కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా? ఒకేరోజు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, ఓవైసీ కీలక ప్రకటనలతో తెలంగాణ రాజకీయాల్లో ఆ రోజు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు సెప్టెంబర్ 17 చుట్టూనే తిరుగుతన్నాయి. ఆ రోజును పార్టీలన్నీ రాజకీయంగా ఓ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాజకీయ రంగు అంటించాయి. తమ పొలిటికల్ మైలేజ్ కోసం పార్టీలన్నీ విమోచన దినోత్సవంపై రాజకీయాలు మొదలుపెట్టాయి. దీంతో విమోచన దినోత్సవంపై పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో చేసేదేమీ లేక తెలంగాణ ప్రభుత్వం కూడా దిగొచ్చింది. విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో అధికారికంగా జరపాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనుంది. దీనికి అమిత్ షాతో కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు హాజరుకాన్నారు. ఇక టీఆర్ఎస్ కూడా ఆ రోజు ఘనంగా ఉత్సవాలు నిర్వహించనుంది. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణ విమోచనం కోసం హిందూవులతో కలిసి ముస్లింలు కూడా పోరాటం చేశారని గుర్తు చేశారు. తురేభాజ్ ఖాన్ విరోచిత పోరాటం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు రాశారు.

సెప్టెంబర్ 17ను జాతీయ సమగ్రత దినోత్సవంగా జరపాలని ఓవైసీ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఇక ఆ రోజు పాతబస్తీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఓవైసీ ప్రకటించారు. పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఓవైసీలు తెలంగాణ విమోచన దినోత్సవం రోజు సభలు నిర్వహిస్తుండటంతో.. ఆ రోజు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది సస్పెన్స్ గా మారింది.

పార్టీల పోటాపోటీ సభలో సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశముంది. ఇప్పటివరకు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని కేసీఆర్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఎంట్రీతో దిగొచ్చినట్లు విమర్శలు చేసే అవకాశముంది. ఇక కేసీఆర్ కూడా ఆ రోజు దీనిపై కౌంటర్ ఇచ్చే అవకాశముంది. ఇక బీజేపీపై ఓవైసీ ఎలాంటి విమర్శలు చేస్తారు. విమోచన దినోత్సవంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఉత్కంఠకరంగా మారింది. సెప్టెంబర్ 17న తెలంగాణలో ఏం జరుగుతుందనేది హైటెన్సన్ క్రియేట్ చేస్తోంది. నేతల మధ్య విమర్శల దాడులతో పొలిటికల్ వేడి మరింత పెరిగే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -