Munugode By-Election: మునుగోడు టికెట్ స్రవంతికి ఇవ్వడం వెనుక పాజిటివ్స్ ఇవే?

Munugode By-Election: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి ఒక ప్రకటన జారీ అయింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు, బీసీ నేతలు కైలాష్​, పల్లె రవి గట్టిగా పోటీ పడ్డారు. కానీ చివరికి పాల్వాయి స్రవంతికే టికెట్ ను ఖరారు చేశారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే రేపు గాంధీవన్ లో ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మునుగోడు టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ కూడా రానున్నారు. వారిని కాంగ్రెస్ సీనియర్లు బుజ్జగించే అవకావముంది. కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని వారిని కోరే అవకాశముంది.

అయితే పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆమె తండ్రి దివంగత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా అప్పట్లో ఉండేవారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి ఐదుసార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి స్రవంతి వచ్చారు. అందుకే తండ్రికి నియోజకవర్గంలో ఫాలోయింగ్ స్రవంతికి కలిసి రానుంది. తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసే సమయంలోనే స్రవంతి ప్రచారంలో పాల్గొంటూ చురుగ్గా ఉండేవారు. రాజకీయాల్లోకి తండ్రికి తోడుగా స్రవంతి ఉండేవారు.

అందుకే నియోజకవర్గంలోని ప్రజలతో స్రవంతి ఎప్పుడూ టచ్ లో ఉండేవారు. అంతేకాకుండా ఆమె ఉన్నత విద్యావంతురాలు. ప్రతి గ్రామంలోనూ ఆమెను అనుచరగణం ఉండటం కూడా కలిసొచ్చే అవకాశం. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. సుదీర్ఠకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా.. ఆమెకు ఎలాంటి పదవి దక్కలేదు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. టికెట్ ఇవ్వడానికి కూడా అదోక కారణంగా తెలుస్తోంది. పాల్వాయి గోవర్దన్ రెడ్డి హాయంలోనే మునుగోడు అభివృద్ది చెందిదని నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత ఉంది. స్రవంతికి టికెట్ ఇస్తే ఆ అంశం కలిసివస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది.

2014 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా సీపీఐకు ఆ సీటు వెళ్లింది. అందుకే స్రవంతి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఆ ఎన్నికల్లో గెలవగా.. రెండో స్ధానంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన స్రవంతి నిలిచింది. దీనిని బట్టి చూస్తేనే నియోజకవర్గంలో ఆమెకు బలం ఉందని అర్ధమవుతుంది. అంతేకాదు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేల్లో కూడా స్రవంతికి పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. స్రవంతికి టికెట్ ఇవ్వడం వెనుక ఇది కూడా ఒక కారణం. పార్టీని చాలామంది సీనియర్లు కూడా స్రవంతికే టికెట్ ఇవ్వాలని కోరారు. అందుకే ఏఐసీసీ స్రవంతికే టికెట్ కేటాయిస్తూ ప్రకటన జారీ చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -