Samantha: పాన్ ఇండియా భ్రమలు తీరినట్టేనా.. సామ్ కెరీర్ ముగిసినట్టేనా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైనప్పటికీ పుష్ప పార్ట్ ఏ ముహూర్తాన ఉత్తరాదిలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యిందో కానీ అప్పటి నుంచి అందరికీ ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టేసింది. అయితే బాహుబలి తోనే ఇది జరిగినప్పటికీ కమర్షియల్ మూవీతో నార్త్ ఆడియన్స్ ని మెప్పించవచ్చని నిరూపించింది అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత కెజిఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించింది. పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్నచిన్న బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి.

చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్క హీరోలు సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇది మొదటి వరకు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే కనీసం ముంబైకి వెళ్లొచ్చిన ఫ్లైట్ టికెట్లు సైతం గిట్టుబాటు కానంత దారుణంగా ఫ్లాపవుతున్నాయి. విజువల్ గ్రాండియర్ గా గుణశేఖర్ దిల్ రాజు తెగ ప్రమోట్ చేసుకున్న శాకుంతలం సినిమా ఏమయ్యిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆల్ టైం డిజాస్టర్ కన్నా మంచి పదం ఏదైనా ఉందేమోనని ట్రేడ్ విశ్లేషకులు వెతుకుతున్నారు.

పెట్టిన బడ్జెట్ లో కనీసం పది వంతు మొదటి వీకెండ్ లో రాకపోతే అంతకన్నా అవమానం ఏముందంటూ ఆలోచనలో పడ్డారు. గత ఏడాది విజయ్ దేవరకొండ నటించి లైగర్ ది కూడా ఇదే పరిస్థితి అని చెప్పవచ్చు. తరువాత వచ్చిన గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలను కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేకపాయే. అఖండ ఇక్కడ రికార్డులు సృష్టించినా ఏడాది ఆలస్యంగా డబ్ చేయడం వల్ల రెవిన్యూ రాలేదు. రవితేజ ఖిలాడీకీ అవమానాలు తప్పలేదు.

రాధేశ్యామ్ పరిస్థితి కూడా అదే అని చెప్పవచ్చు. పాన్ ఇండియా అంటూ కలలు కనడమే తప్ప సినిమాలో పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అంతేకాకుండా భారీ మూల్యం చెల్లించాల్సి రావడంతో పాటు ఢిల్లీ ముంబై బ్యాచులకు చులకన అయిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆల్ ఇండియా సినిమాలపై కాస్త శ్రద్ధ అనిపించి విడుదల చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాన్ ఇండియా సినిమాల భ్రమ తీరినట్టేనా సమంత కెరియర్ ముగిసినట్టేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -