Paruchuri Gopalakrishna: కేజీఎఫ్2పై పరుచూరి షాకింగ్ కామెంట్స్.. రేటింగ్ తగ్గడానికి కారణమిదే!

Paruchuri Gopalakrishna: కొన్ని సినిమాలు వెండితెరపై సంచలనాలు సృష్టించినా బుల్లితెరపై అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా వెండితెరపై సంచలనాలు సృష్టించి బుల్లితెరపై పెద్దగా ఆకట్టుకోని సినిమాలలో కేజీఎఫ్2 సినిమా కూడా ఒకటి. కేజీఎఫ్2 సినిమాకు బుల్లితెరపై కేవలం 9.15 రేటింగ్ రావడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశం కాకపోవడం వల్లే ఈ సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ వచ్చిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. కేజీఎఫ్2 సినిమా గురించి కొన్ని రివ్యూలు నెగిటివ్ గానే కనిపించాయని సంపాదించిన డబ్బును తను మాత్రమే తినకుండా అనుచరుల క్షేమం కోరే వ్యక్తిగా రాకీ భాయ్ పాత్రను సినిమాలో చూపించారని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. ఈ కథ ఫిక్షనల్ స్టోరీ కావడంతో త్వరగా అందరికీ నచ్చదని ఆయన తెలిపారు.

కేజీఎఫ్, కేజీఎఫ్2 ఫిక్షనల్ స్టోరీలు అయినా జరిగిన కథనే మనకు చూపిస్తున్నారనే అనుభూతి ప్రేక్షకులకు కలిగేలా చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. హీరోయిన్ పాత్రను గర్భవతిగా చూపించి చంపేశారని చాలామందికి ఇది మింగుడుపడని విషయమని గోపాలకృష్ణ అన్నారు. ఆ అమ్మాయి చనిపోకుండా ఉండి ఉంటే ఆ అమ్మాయి కడుపున పుట్టిన బిడ్డ కేజీఎఫ్3 సినిమాలో హీరోగా వస్తాడనే భావన ఉండేదని ఆయన తెలిపారు.

కేజీఎఫ్ ఛాప్టర్3 కనుక తీస్తే అతనిపై 16 దేశాలలో ఉన్న కేసుల గురించి అందులో ప్రస్తావించే అవకాశం ఉందని గోపాలకృష్ణ తెలిపారు. సముద్రంలో మునిగిపోయిన రాఖీభాయ్ మళ్లీ బ్రతికే ఉన్నట్లు చూపించే ఛాన్స్ కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాఖీ భాయ్ భార్యను చంపేయడం సినిమాకు మైనస్ అయిందని పరుచూరి తన కామెంట్ల ద్వారా వెల్లడించారు. కథ, కథనం మరీ అడ్వాన్స్డ్ గా ఉండటం వల్లే ఈ సినిమాకు రేటింగ్ తగ్గిందని నెటిజన్లు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -