Salaar: సలార్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూది.. అలా ఉందంటూ?

Salaar: డిసెంబర్ 22న విడుదలైన సలార్ చిత్రం ఘన విజయాన్ని అందుకున్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ లో నెట్ఫిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాని చూసిన సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే ని ప్రశాంత్ నీల్ చాలా బాగా రాసుకున్నారు. ఈ కథ భారత దేశంలో జరిగిన కథలా అయితే సెన్సార్ లో ఎన్నో సమస్యలు వస్తాయి.

 

అందుకే భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల దగ్గర అయినదిగా రాశారు. “అఖండ భారతదేశం కలవడం తండ్రి రాజ మన్నార్ కు ఇష్టం లేదు” అని ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే ద్వారా తెలియజేయడం చాలా స్పష్టంగా ఉన్నది. ఈ సినిమాలో 30 నిమిషాల వరకు ప్రభాస్ కి డైలాగులే కనిపించలేదు. అయినా కూడా ప్రభాస్ ని చూపించే విధానంలో ప్రశాంత్ నీల్ విజయం సాధించారు. ఈ సినిమా స్నేహ ధర్మానికి ప్రతీక.

స్నేహం కోసం ఏమైనా చేయొచ్చు అని తెలుపుతుంది ఈ సినిమా. ఇందులో ప్రభాస్ స్క్రీన్ ప్రజెంట్ చాలా బాగుంది. ప్రభాస్ ని బాగా వాడుకున్నారు. సినిమా అయిపోయిన తర్వాత మనకి ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్, తన యాక్టింగ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గుర్తుండిపోతుంది. మిగిలిన పాత్రధారులు కూడా చాలా బాగా నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్రలో అల్లుకుపోయారు. ఇది అందరూ తప్పక చూడవలసిన సినిమా.

 

ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా అడిగితే ప్రభాస్ యాక్టింగ్ కోసమని చెప్పాలి. ఈ సినిమా చూసి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని చూడాలి ప్రభాస్ తన యాక్టింగ్ ని ఇందులో ఇరగదీసేసాడు. పార్ట్ వన్ చాలా బాగుంది పార్ట్ టూ ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను అని సలార్ సినిమా పై తన అభిప్రాయాన్ని చెప్పారు పరిచూరి గోపాలకృష్ణ.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -