Pawan Kalyan: కాపులకు భారీ షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. జాగ్రత్త పడాల్సిందే!

Pawan Kalyan: కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి ఈయన వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఇన్ని రోజులపాటు జనసేన పార్టీకి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి నాగబాబు అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆర్భాటంగా గొప్పగా చెప్పుకున్నారు. అయితే కాపులకు పవన్ కళ్యాణ్ మాత్రం భారీగా షాక్ ఇచ్చారని తెలుస్తుంది.

కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే పొత్తు గురించి పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. పొత్తులు ఉంటాయని కానీ సీఎం పదవి తాను ఆశించడం లేదు అంటూ ఈయన షాక్ ఇవ్వడంతో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే విషయం చెప్పకపోయినా పొత్తు అనేది తప్పకుండా ఉంటుందని చంద్రబాబు నాయుడుని సీఎంగా చూడటమే లక్ష్యం అంటూ చేసినటువంటి కామెంట్స్ అవుతున్నాయి.

 

జగన్ సర్కారును అధికారం నుంచి దింపడం కోసం తాను పొత్తు పెట్టుకుంటున్నానని, అయితే పొత్తును అడ్డుపెట్టుకొని సీఎం పదవిని తాను ఆశించలేనని తెలియజేశారు. గత ఎన్నికలలో తనకు 30 నుంచి 40% ఓట్లు కనకపడి ఉంటే తప్పకుండా సీఎం పదవిని ఆశించేవాడిని,అయితే గత ఎన్నికలలో తనకు పెద్దగా ఓట్లు పడకపోవడంతో తాను సీఎం పదవిని ఆశించడం సరైనది కాదని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

 

ఇక రాయలసీమలో తన పార్టీకి పెద్దగా బలం లేదని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. తన పార్టీకి ఎక్కడైతే మంచి బలం ఉందో ఆ ప్రాంతాలలో తప్పకుండా పోటీ చేస్తానంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయన ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కాపు నేతల ఆశలపై పవన్ కళ్యాణ్ నీరు చల్లారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -